Site icon vidhaatha

Abidur Chowdhury | ప్రపంచలోనే అతి పలుచని మొబైల్​ – ఐఫోన్​ 17 ఎయిర్​ను డిజైన్​ చేసిందెవరో తెలుసా?

కుపర్టినో: Abidur Chowdhury | “రాబోయే కాలపు భాగంలా అనిపించే ఐఫోన్‌ తయారు చేయాలనుకున్నాం,” అని ఆపిల్ ఇండస్ట్రియల్ డిజైనర్ అబిదుర్ చౌధురీ వేదికపై చెప్పిన ఒక్క వాక్యమే కొత్త ఐఫోన్​ ఎయిర్ భావాన్ని నిర్వచించింది. టైటానియం బాడీతో వచ్చిన ఈ మోడల్ గత తరం ఫోన్లతో పోలిస్తే సుమారు మూడో వంతు సన్నగా, ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోన్​గా రికార్డు సృష్టించింది. సింగిల్ రియర్ కెమెరా (టెలిఫోటో) అమరికతో, AI ఆధారిత ఫోటోగ్రఫీ–బ్యాటరీ ఆప్టిమైజేషన్లతో దృష్టిని ఆకర్షించింది.

ఈ ఐఫోన్​ ఎయిర్​కు రూపకల్పన ​ చేసింది అబిదూర్​ చౌధరి. పేరును బట్టి భారతీయుడేనని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. భారతీయ రక్తం అమెరికా పేరు ప్రఖ్యాతులకు, ఆర్థిక బలోపేతానికి ఎంత శక్తిని అందిస్తో తెలిపే మరో ఉదాహరణ ఇది.

ఎవరీ అబిదుర్​ చౌధురీ?

చౌధురీ వివరించినట్టు, ఎయిర్​ కెమెరా–చిప్‌సెట్–సిస్టమ్ మాడ్యూల్స్‌ను సరిగ్గా అమర్చేందుకు ఫోన్ వెనుక భాగంలోని కెమెరా సెక్షన్​ను  కొత్తగా డిజైన్ చేసి, మిగతా అంతర్గత స్థలాన్ని హై-డెన్సిటీ బ్యాటరీకి కేటాయించారు. ఫలితంగా బాడీ సన్నగా ఉన్నా ఆల్-డే బ్యాటరీ లైఫ్ లక్ష్యాన్ని సాధించామన్నారు. “నమ్మడానికి చేతితో పట్టుకున్నా, నమ్మలేని నిజం అన్న భావన,” అంటూ ఆయన ఈ ఫోన్​ను వర్ణించారు.

అబిదుర్ చౌధురీ లండన్‌లో జన్మించి ప్రస్తుతం సాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. Loughborough Universityలో Product Design & Technologyలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే James Dyson Foundation bursary, New Designers–Kenwood Award, Seymour Powell Design Week పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. 2016లో Red Dot Design Awardతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్స్, Curventa వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు ముగించి, లండన్‌లోని Layer డిజైన్ స్టూడియోలో ఇండస్ట్రియల్ డిజైనర్‌గా పనిచేశారు. 2018–19లో స్వతంత్ర కన్సల్టెన్సీ నడిపిన తర్వాత 2019 జనవరిలో ఆపిల్‌లో ఇండస్ట్రియల్ డిజైనర్​గా చేరారు. అప్పటి నుంచి సంస్థలోని అనేక వినూత్న ఉత్పత్తుల డిజైన్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్/ప్రొఫైల్ తెలియజేస్తుంది.

ఐఫోన్​ ఎయిర్​తో పాటు, ఆపిల్ ఐఫోన్​ 17, 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్​ మోడళ్లనూ ప్రకటించింది. పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరాలు, కొత్త A19 Pro చిప్ వంటి అప్‌డేట్‌లు ఈ లైనప్‌లో భాగం. భారత మార్కెట్లో విభిన్న స్టోరేజ్–కలర్ ఆప్షన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

స్టేజిపై ముఖం కనిపించకపోయినా—పేరే మాట్లాడేలా, ఐఫోన్​ ఎయిర్​ రూపకల్పన వెనుక ఉన్న ఇంజినీరింగ్ నైపుణ్యాలను అబిదుర్ చౌధురీ చక్కగా వివరించారు. అతిసన్న బాడీలో పనితీరు, బ్యాటరీ సమతుల్యం ఎలా సాధించారన్నది ఈ రూపకల్పన  గాథలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Exit mobile version