Site icon vidhaatha

AIIMS Doctor Joke | ‘అప్పట్లో చాట్‌జిపీటీ ఉంటే బ్రేకప్‌ అయ్యేదే కాదు’ : ఓ వైద్యుడి విఫల ప్రేమ గాథ

 న్యూఢిల్లీ: AIIMS Doctor Joke | ప్రేమ విఫలమైతే బాధ, నిరాశ, బాధ్యతారహితపు ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఒక వైద్యుడు మాత్రం తన విఫల ప్రేమను హాస్యధోరణిలో పంచుకున్నాడు. ఢిల్లీలోని AIIMS వైద్యుడు డాక్టర్ నితిన్ త్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా నవ్వుల మాటగా మారింది. నా కాలేజ్ రోజులలో చాట్జిపీటీ ఉంటే, నా గర్ల్ఫ్రెండ్ నన్ను దిలేది కాదు అని ఆయన చమత్కరించారు.

డాక్టర్‌ దత్తా కాలేజీ రోజుల్లో ఒక యువతితో ప్రేమలో ఉండేవాడు. కానీ, చిన్నచిన్న తప్పులను పదే పదే చేయడం ఆమెను విసిగించింది. సమయానికి రాకపోవడం, ముఖ్యమైన రోజులు మరిచిపోవడం, ఎప్పుడూ “డిసెక్షన్ హాల్‌లో ఉన్నాను” అనే నెపంతో తప్పించుకోవడం—ఇవన్నీ కలిసి వారి బంధాన్ని దెబ్బతీశాయి. చివరికి ఆమె ఆఖరి మాట: ఎంత చెప్పినా నువ్వు నేర్చుకోవు, మారవు. అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తావు.

ఈ మాటలు డాక్టర్‌ దత్తా మనసులో అలాగే నిలిచిపోయాయి. ఇన్నేళ్ల తరువాత ఏఐ పరిణామ క్రమాన్ని చూసిన ఆయనకు ఒక విచిత్రమైన పోలిక గుర్తు వచ్చింది. “నేను పాత ప్రోగ్రామ్‌లా ఉండి అవే తప్పులను పునరావృతం చేశాను. కానీ కృత్రిమ మేధస్సు మాత్రం తనకొస్తున్న సమాచారం  నుంచి నేర్చుకుంటూ, మెరుగుపడుతూ ముందుకు సాగుతోంది. ఇదే నాకు మొదటి AI అహా క్షణం అయింది” అని ఆయన చెప్పుకున్నారు.

ఇటీవల ఆయన తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో సరదాగా ఇలా రాశారు:

నా గర్ల్ఫ్రెండ్ అప్పట్లో నన్ను చూసి ‘AI లాగా ఉండాలినుకుంది. సమయంలో చాట్జిపీటీ ఉంటేబ్రేకప్ య్యేది కాదు 🤖

ఈ వైద్యుడి హాస్యచతురత నెటిజన్లను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. కొందరు మన టెక్స్ట్లన్నీ చాట్జిపీటీ రాస్తే బాగుండేది అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు ఇది సరదా మాత్రమే కాదు, లోతైన జీవితపాఠం కూడా ఉంది అని స్పందిస్తున్నారు.

డాక్టర్ దత్తా.. ఒక విఫల ప్రేమను సరదా జోక్‌గా మార్చి, అందులోనూ ఒక జీవిత పాఠాన్ని పాఠకులకు అందించారు. మనుషులు కూడా AI లాగా తప్పుల నుంచి నేర్చుకుంటే, సంబంధాలు మరింత బలపడతాయి.

Exit mobile version