Site icon vidhaatha

Netflix | నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్లకు అలెర్ట్‌.. ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పేరు మెయిల్‌ వస్తే జాగ్రత్త..!

Netflix | కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి. దీన్ని బాగా సైబర్‌ నేరగాళ్లు బాగా వంటబట్టించుకుంటున్నారు. కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తున్న సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ పేరుతో నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. ఇటీవల కొద్దిరోజులుగా నెట్‌ఫ్లిక్‌ మెయిల్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఏ మెయిల్‌ ఐడీ నెట్‌ఫ్లిక్స్‌ లింక్‌ అయి ఉందో దానికే ఓ సందేశం వస్తున్నది. అందులో మెంబర్‌షిప్‌ ఎక్స్‌పైర్‌ అవుతున్నట్లుగా స్పామ్‌ మెయిల్స్‌ వస్తున్నాయి.

ఆ తర్వాత 90రోజుల పాటు ఫ్రీగా ఇస్తున్నామంటూ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్లకు లింక్‌ వస్తుంది. అది చూసిన చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌ నుంచి వచ్చిందని భావిస్తూ అందులో నిజమెంతో తెలుసుకోకుండానే.. లింక్‌ని ఓపెన్‌ చేసిన డెబిట్‌కార్డులు, క్రెడిట్‌కార్డులతో వ్యక్తిగత వివరాలను సైతం ఇచ్చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే, ఇప్పటికే సైబర్‌ మోసాల గురించి ‘ఫ్రీ సబ్‌ స్క్రిప్షన్‌ పేరుతో వచ్చే మెయిల్స్‌ని నమ్మొద్దని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సూచించింది.

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత.. బ్యాంకులకు సంబంధించిన వివరాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. లింక్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌ హవా కొనసాగుతున్నది. వివిధ జోనర్స్‌కు సంబంధించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌, వీడియో గేమ్స్‌తో యూజర్లకు ఆకట్టుకుంటున్నది. గతంలో కంటే భిన్నంగా భారీ వ్యయంతో సినిమాలను కొనుగోలు చేస్తున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూవీలను యూజర్ల ముందుకు తీసుకువస్తున్నది.

Exit mobile version