WhatsApp | వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్‌.. మీ ప్రొఫైల్‌ పిక్‌ను ఎవరూ స్క్రీన్‌ షాట్‌ తీయలేరు..!

  • Publish Date - April 13, 2024 / 11:15 AM IST

WhatsApp : వాట్సాప్‌లో మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ రాబోతోంది. ఇకపై మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ను ఎవరూ స్క్రీన్ షాట్ తీయలేరు. ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్‌కు సంబంధించిన వివరాలను మెటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఉన్న యూజర్ల ప్రొఫైల్ పిక్చర్లను స్క్రీన్ షాట్ తీయడం ఇప్పటికే కుదరడం లేదు. అందరిలా సాధారణ వాట్సాప్ వెర్షన్లు వాడే వాళ్ల ప్రొఫైల్‌ పిక్‌లు మాత్రమే స్క్రీన్ షాట్లు తీయగలుగుతున్నారు. ఇకపై సాధారణ వెర్షన్‌లు వాడే వాళ్ల ప్రొఫైల్‌ పిక్‌లు కూడా స్క్రీన్‌ షాట్‌లు తీయడం కుదరదు. ఎందుకంటే ఆ ఛాన్స్‌ లేకుండా మరో ప్రైవసీ ఫీచర్‌ వస్తోంది. ఇతరుల ప్రొఫైల్ పిక్చర్లు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకే వాట్సాప్‌ ఈవిధమైన ప్రైవసీ సేఫ్టీ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది.

అవతలి వాళ్ల వాట్సాప్ (WhatsApp) ప్రొఫైల్ పిక్చర్‌ను స్క్రీన్ షాట్ తీయడానికి ప్రస్తుతం ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వస్తున్న ప్రైవసీ ఫీచర్ వల్ల ప్రొఫైల్ పిక్చర్‌ను స్క్రీన్ షాట్ తీయడం ఇక వీలు పడకపోవచ్చు. ఒకవేళ ఆ ప్రొఫైల్ ఫొటోను సేవ్ చేసుకోవాలి అనుకుంటే.. మరో ఫోన్ నుంచి ఆ ప్రొఫైల్ పిక్‌ను ఫొటో తీసే అవకాశం ఉంది. మెయిన్ చాట్ లిస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి దాన్నుంచి నుంచి యూజర్ ప్రొఫైల్ ఫొటోను క్యాప్చర్ చేసే రిస్క్ కూడా ఉంటుందది.

మల్టీపుల్ ఛాట్‌లను పిన్ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇది కూడా టెస్టింగ్‌లో ఉంది. దీని ద్వారా మనం పర్సనల్, గ్రూప్ ఛాట్లను పిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం ఒక్క ఛాట్‌ను మాత్రమే పిన్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్ ద్వారా మూడు ఛాట్ల వరకు పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.6.15లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ రెండింటికీ ఈ ఫీచర్‌ను మెటా అందించనుంది.

Latest News