న్యూఢిల్లీ: దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్(Apple) నుంచి మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్17(iPhone17) మంగళవారం రాత్రి 10:30గంటలకు విడుదల కానుంది. మొబైల్ ప్రియుల్లో యాపిల్ ఐ ఫోన్లకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. ఫోన్ విడుదలైందో లేదో యాపిల్ షోరూమ్ ల వద్ధ ఐఫోన్ ప్రియులు క్యూలైన్లు కడుతుంటారు. హాట్ కెకుల్లా ఐఫోన్స్ అమ్మడవుతుంటాయి. ఐ ఫోన్ 16కు కొనసాగింపుగా.. కొత్తగా మంగళవారం యాపిల్(Apple) నుంచి విడుదల కాబోతున్న ఐ ఫోన్ 17, ఐ ఫోన్ 17ఎయిర్, ఐఫోన్ 17 ప్రో(iPhone 17 Pro), ఐఫోన్ 17 ప్రో మ్యాక్(iPhone 17 Pro max), అలాగే ప్లస్ మోడల్ స్థానంలో తెస్తున్న ఐ ఫోన్ ఎయిర్ మోడల్స్ కోసం మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొత్తగా వస్తున్న ఐ ఫోన్ 17 ఫోన్లు ఏ 19 ప్రో చిప్ సెట్ తో… 6.3అంగుళాల స్క్రీన్, 120హెచ్ జడ్ రిఫ్రెష్ రేటు డిస్ ప్లే తో అల్యూమినియం ఫ్రేమ్ తో రాబోతున్నాయి. ఐఫోన్ 17(iPhone 17)అన్ని వేరియంట్ల ఫోన్లలోనూ డిజైన్లు, కెమెరా, బ్యాటరీ పనితీరు మరింత మెరుగ్గా తీసుకరాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర రూ.67వేల నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఐఫోన్‌లతో పాటు వాచ్‌లు(Watch), ఎయిర్‌పాడ్స్‌ను(Airpods) కూడా యాపిల్ లాంచ్ చేయనుంది. యాపిల్ వాచ్ అల్ట్రా 3(Apple Watch Ultra 3), యాపిల్ వాచ్ సిరీస్ 11(Apple Watch series 11), యాపిల్ వాచ్ ఎస్‌ఈతో పాటు ఎయిర్‌పాడ్స్ 3 ప్రోను మరికొన్ని గంటల్లో జరిగే ఈవెంట్‌లో యాపిల్ విడుదల చేయనుంది.