Supreme Court | ఇకపై అడ్వకేట్స్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

Supreme Court | అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా అప్డేట్ అయ్యేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఇకపై అడ్వకేట్స్‌కు ఇవ్వాల్సిన సమాచారాన్ని అంతా వాట్సాప్ ద్వారా పంపనున్నట్లు తెలిపింది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలను ఆయా న్యాయవాదులకు వాట్సాప్ ద్వారా పంపుతామని CJI జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

  • Publish Date - April 25, 2024 / 03:15 PM IST

Supreme Court : అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా అప్డేట్ అయ్యేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఇకపై అడ్వకేట్స్‌కు ఇవ్వాల్సిన సమాచారాన్ని అంతా వాట్సాప్ ద్వారా పంపనున్నట్లు తెలిపింది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలను ఆయా న్యాయవాదులకు వాట్సాప్ ద్వారా పంపుతామని CJI జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రచూడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు ఈ ప్రకటన చేశారు. న్యాయ సేవలను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

’75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న ఈ ఏడాదిలోనే సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా సుప్రీంకోర్టులోని ఐటీ సర్వీస్‌లను వాట్సాప్‌తో అనుసంధానం చేయనుంది’ అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. వాట్సాప్‌తో అనుసంధానం తర్వాత న్యాయవాదులకు ఆటోమేటెడ్ మెసేజ్‌లు వెళ్తాయని తెలిపారు.

కేసుల ఫైలింగ్‌కు సంబంధించిన వివరాలు ఆటోమేటెడ్‌ మెసేజ్‌లలో అందులో ఉంటాయని, cause list లు పబ్లిష్ అయిన తర్వాత ఆ కాపీలు కూడా వాట్సాప్ ద్వారా పంపుతామని జస్టిస్‌ చంద్రచూడ్ వివరించారు. కోర్టులో ఓ రోజు ఏయే కేసుల విచారణ జరుగుతుందో చెప్పేదే ఈ కాజ్ లిస్ట్ అని తెలిపారు. ఈ నిర్ణయంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఇదొక చరిత్రాత్మకమైన నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇప్పటికే సుప్రీంకోర్టులోని కీలక వ్యక్తి వాట్సాప్ నంబర్‌ను జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదులు అందరికీ ఇచ్చారు. ఆ నంబర్‌కు మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం కుదరదని తెలిపారు. అన్ని వివరాలను ప్రింట్ తీసి అందరికీ ఇవ్వడంవల్ల పేపర్లు వృథా అవుతున్నాయని, కొంతవరకు వాటి వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.

Latest News