Site icon vidhaatha

Dirty Stream Malware | ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌పై డర్టీ స్ట్రీమ్‌ మాల్వేర్‌ దాడి..! హెచ్చరించిన మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ..!

Dirty Stream Malware | ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతున్నది. అదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త వైరస్‌లు, మాల్వేర్లతో దాడులకు దిగుతూ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ‘డర్టీ స్ట్రీమ్‌’ మాల్వేర్‌ సహాయంతో సైబర్‌ నేరగాళ్లు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసి.. మొబైల్స్‌లోని విలువైన సమాచారాన్ని కాజేస్తున్నారు. ఈ మాల్వేర్‌పై ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సెక్యూరిటీ టీమ్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు హెచ్చిరకలు జారీ చేసింది. ఇది ప్రమాదకరమైన మాల్వేర్‌ అని మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ బృందం తెలిపింది.

ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి చొరబడి.. ఫోన్‌ మొత్తాన్ని హ్యాక్‌ చేస్తుందని.. ఒక మొబైల్‌లోని యాప్‌ మరో యాప్‌తో మాట్లాడుకునేందుకు అనుమతి ఇస్తుందని పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్ ద్వారా ఫోన్లలోకి చొరబడుతుందని.. ఆండ్రాయిడ్​ మొబైల్‌లోని కంటెంట్​ ప్రొవైడర్​ సిస్టమ్‌పై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. మొబైల్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఫోన్‌ దాని కంట్రోల్‌కి వెళ్తుంది. ఫోన్ హ్యాక్ అయ్యాక.. అందులోని ఫైల్స్ అన్నీ సైబర్‌ నేరగాళ్ల సర్వర్స్‌కి బదిలీ అవుతాయి. ఫోన్‌లోని యాప్‌లను హ్యాకర్లు హైజాక్ చేసి.. వాటి నుంచి ఇష్టం వచ్చిన వారికి మెసేజ్‌లను పంపుతారు.

యూజర్ల ప్రైవసీకి, భద్రతకు ముప్పు కలిగించే తరహాలో ప్రమాదకర యాక్టివిటీని హ్యాకర్లు నిర్వహించేలా ఈ డర్టీ స్ట్రీమ్‌ మాల్వేర్‌ మార్గం సుగమం చేస్తుంది. ఈ క్రమంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోని యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ లిస్టులో షావోమీ ఫైల్ మేనేజర్​ సైతం ఉన్నది. ఈ యాప్‌కి బిలియన్‌కిపైగానే డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. డబ్ల్యూపీఎస్​ (WPS) ఆఫీస్ యాప్‌కు 500 మిలియన్ డౌన్​లోడ్స్​ ఉన్నాయి. వాస్తవానికి ఈ యాప్​ల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌లు విడుదలయ్యాయి. ఎంతమేరకు మన డివైజ్‌కు సెక్యూరిటీగా ఉంటాయన్నది తెలియదు. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. సైబర్ దాడుల నుంచి కాపాడుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్‌ పార్టీ యాప్‌లను వాడకూడదు. కచ్చితంగా గూగుల్ ప్లే ప్రొటెక్ట్​ను ఎనేబుల్ చేసుకోవాలని.. ఆండ్రాయిడ్ ఫోనులో ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్స్​ సైడ్ లోడింగ్ చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైడ్​ లోడింగ్ యాప్స్​ ప్రమాదకరమైన వైరస్​లు ఫోన్‌లోకి చొరబడుతాయని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version