iPhone 16 | సూపర్‌ అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌తో వచ్చేస్తోన్న ఐఫోన్‌-16.. అవేంటో తెలిస్తే వావ్‌ అనాల్సిందే..!

iPhone 16 | ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఆపిల్‌ త్వరలో ఐఫోన్‌16ని లాంచ్ చేయనున్నది. అయితే, ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. ఐఫోన్‌-16లో ఇవ్వనున్న ఫీచర్స్‌ అందరినీ థ్రిల్‌ చేస్తున్నాయి.

  • Publish Date - April 27, 2024 / 08:37 AM IST

iPhone 16 | ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఆపిల్‌ త్వరలో ఐఫోన్‌16ని లాంచ్ చేయనున్నది. అయితే, ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. ఐఫోన్‌-16లో ఇవ్వనున్న ఫీచర్స్‌ అందరినీ థ్రిల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్‌-15లో కంటే ఐఫోన్‌-16 అప్‌డేట్స్‌ ఏం ఉన్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఐఫోన్‌ 15తో పోలిస్తే ఐఫోన్‌-16 డిజన్‌ సైతం అప్‌డేట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. డైనమిక్ ఐలాండ్, యాక్షన్ బటన్స్‌తో రానున్నది.

ఐఫోన్‌ 15లో ఉన్న డయాగ్నల్‌ కెమెరా ప్లేస్‌మెంట్‌ ఉండదు. దానికి బదులుగా వర్టికల్‌ కెమెరా సెటప్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉన్నది. రాబోయే కొత్త ఫోన్‌లో 60 హెర్ట్‌జ్‌ రిఫ్రెష్ రేట్​తో 6.1 ఇంచ్​ డిస్‌ప్లేను కొనసాగించే అవకాశలున్నాయి. అదనంగా పర్పుల్‌, వైట్‌ కలర్స్‌లో మొబైల్స్‌ రానున్నాయి. కెమెరా సెటప్‌ విషయానికి వస్తే పెద్దగా అప్‌డేట్స్‌ ఉండవని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న మోడల్‌ మాదిరిగానే 48 మెగాపిక్సెల్ సెన్సార్​ ఉంటుందని సమాచారం. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. లాంచ్‌కు ఇంకా సమయం ఉండడంతో త్వరలోనే వివరాలు బయటకు వచ్చే ఛాన్స్‌ ఉన్నది. ఐఫోన్‌ 16లో కొత్తగా ఏ 18 చిప్​సెట్​ తీసుకువచ్చే ఛాన్స్‌ ఉన్నది. ఐఓఎస్ 18 అప్​డేట్​తో ఏఐ ఫీచర్స్‌ను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని.. ప్రాసెసర్‌ని అప్‌డేట్‌ చేయడం వెనుక ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా భావిస్తున్నారు.

ఇక బ్యాటరీ పరిమాణం ఐఫోన్-16లో 3561 ఎంఏహెచ్ అప్​గ్రేడెడ్​ బ్యాటరీ ఇచ్చే ఛాన్సెస్‌ ఉన్నాయి. ఐఫోన్ 15లో 3349 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న విషయం తెలిసిందే. ఆపిల్‌ ఏటా జరిగే ఈవెంట్‌లో ఐఫోన్‌ కొత్త సిరీస్‌ను విడుదల చేస్తూ వస్తున్నది. ప్రస్తుతం రాబోయే మోడల్స్‌లో ఏం ఫీచర్స్ ఇవ్వబోతున్నదో అప్పటి వరకు వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఐఫోన్16 అప్‌డేట్స్‌ అన్నీ కేవలం రూమర్స్‌ మాత్రమే. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. లాంచ్‌ వరకు వేడి చూడక తప్పదుమరి..!

 

Latest News