Site icon vidhaatha

Earth Rotation | భూవేగంలో మార్పులు.. ఇక రోజుకు 24 గంటలు కాదు 25 గంటలట..?

Earth Rotation | ఇప్పటి వరకు మనం రోజుకు 24 గంటలు అని చదువుకున్నాం. కానీ, ఇకపై ఈ రోజుకు 25 గంటలు అని చదువుకోవాల్సి రానున్నది. అనువు.. మీరు చదువుతున్నది నిజమే. నమ్మేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్నా రాబోయే రోజుల్లో జరుగబోయేది ఇదే..! ప్రస్తుతం 24 గంటలుగా రోజుకు ఉండగా.. భవిష్యత్‌లో 25 గంటలుగా మారబోతున్నది. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న నేపథ్యంలో భూమి వేగంలో గణనీయంగా చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

భూమివేగం మందగిస్తుందని.. దాంతో సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయం ఓ గంట అదనంగా పెరుగుతుందని.. దాంతో రోజుకు 25 గంటలుగా మారే అవకాశం ఉందని మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా చేశారు. అయితే, ఇది ఇప్పుడే ఏం జరిగేది కాదని పేర్కొన్నారు. 14లక్షల సంవత్సరాల కిందట రోజుకు 18.41 గంటలుగా ఉండేది. ఈ లెక్కన మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉండబోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అయితే, భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పులను అంచనా వేశారు. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలేని వివరించారు. భూమిపై ఒక రోజు కాలం 25 గంటలకు పెరిగితే.. చంద్రుడు సైతం భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటికి భూమిపై ఉండే ఖండాలన్నీ ఏకమై.. ఏకఖండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

Exit mobile version