Site icon vidhaatha

Aadhar | ఆధార్‌ యూజర్లకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటో తెలుసా..?

Aadhar |

ఆధార్‌ యూజర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 14తో ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు సంబంధించిన గడువు ముగిసింది.

అయితే, యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) మరో మూడు నెలల పాటు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో సెప్టెంబర్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కలుగనున్నది.

గడువు ముగిసిన తర్వాత ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు ఫీజు చెల్లించాల్సి రానున్నది. సాధారణంగా యూఐడీఏఐ నిబంధనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి.. ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు మై ఆధార్ పోర్టల్ అందుబాటులో ఉంది. ఇందులో పుట్టిన తేదీ, అడ్రస్ తదితర వివరాలను మార్చుకునేందుకు అవకాశం ఉంది. ఇక ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌కు సంబంధించిన గడువు ముగిసిన తర్వాత కేంద్రాల్లో రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version