Google Gemini | తెలుగులో గూగుల్‌ ఏఐ యాప్‌ జెమిని.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే..!

Google Gemini | ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు డిమాండ్‌ పెరిగింది. చాట్‌ జీపీటీ పుణ్యమా అని ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్లు టూల్స్‌ను తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ సైతం జెమిని (బార్డ్‌) టూల్‌ను సైతం పరిచయం చేసింది.

  • Publish Date - June 19, 2024 / 09:28 AM IST

Google Gemini | ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు డిమాండ్‌ పెరిగింది. చాట్‌ జీపీటీ పుణ్యమా అని ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్లు టూల్స్‌ను తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ సైతం జెమిని (బార్డ్‌) టూల్‌ను సైతం పరిచయం చేసింది. తాజాగా జెమిని ఏఐ అసిస్టెంట్ టూల్‌ను గూగుల్‌ మరింత అభివృద్ధి చేసింది. గూగుల్ తన జెమిని టూల్‌ని మొబైల్ యాప్ రూపంలో భారత్‌లో విడుదల చేసింది. తొమ్మిది భారతీయ భాషల్లో సేవలు అందిస్తుండగా.. అందులో తెలుగు సైతం ఉండడం విశేషం. ఈ యాప్ సాయంతో ఏదైనా సెర్చ్ చేయడంతో పాటు టైప్‌ చేయకుండా వాయిస్‌ అసిస్టెంట్‌తో గానీ, ఫొటోను ఉపయోగించి సెర్చ్‌ చేయొచ్చు.

ప్రస్తుతం జెమిని ఏఐ యాప్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో ఐఓఎస్‌ యూజర్లకు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే, జెమిని యాప్‌లో రెండు వెర్షన్‌ ఉన్నాయి. ఇందులో సాధారణ వెర్షన్‌కు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా వాడుకునేందుకు వీలుంటుంది. రెండోది ప్రీమియం వెర్షన్‌. దీంట్లో కొంచెం ఫీచర్లు ఎక్కువగానే ఉంటాయి. అందుకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్‌ తన జెమిని ఏఐ టూల్‌ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటామని చెప్పింది. రాబోయే రోజుల్లో కొత్త కొత్త ఫీచర్స్‌ని యాడ్‌ చేస్తామని కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రస్తుతం జెమిని యాప్‌ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో సేవలు అందిస్తున్నది.

Latest News