Site icon vidhaatha

మరో ఈవీని పరిచయం చేయనున్న మహీంద్రా..! ఫీచర్స్‌, ధర, లాంచ్‌ డేట్‌ వివరాలు ఇవే..!

Mahindra XUV300 EV | ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్నది. భారీగా పెరిగిన పెట్రో ధరల నేపథ్యంలో అందరూ ఈవీలపై వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కార్ల తయారీ కంపెనీలు సైతం ఈవీలపై దృష్టిపెడుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఫోకస్‌ చేసింది. ఇప్పలికే పలు మోడల్స్‌ను తీసుకురాగా.. తాజాగా సరికొత్తగా ఈవీ కారుపై పని చేస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 300ని ఈవీగా మార్చాలని నిర్ణయించినట్లు టాక్‌. ఈ కారును 2024 జూన్‌లోగానే లాంచ్‌ చేయాలని ప్రణాళిక రూపొందించిందని పలు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి.

ఎక్స్​యూవీ300 ఈవీ ఫీచర్స్‌..


మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీ ప్రస్తుతం ఉన్న ఐసీఈ ఇంజిన్​ మోడల్​తోనే తరహాలోనే ఉండే అవకాశాలున్నాయి. డ్రాప్​-డౌన్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ ఉండే అవకాశం ఉన్నది. బంపర్​, హెడ్​ల్యాంప్​, గ్రిల్‌ మోడల్‌ మార్చే సూచనలున్నాయి. రియర్‌లో టెయిల్​గేట్​ సరికొత్తగా ఉండనుందని టాక్‌. రిజిస్ట్రేషన్​ ప్లేట్​ని పెట్టే ప్లేస్‌ను సైతం మార్చే అవకాశం ఉందని టాక్‌. ఇక ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ కేబిన్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. భారీ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఏసీ వెంట్స్​, స్విచ్​గేర్​, సెంటర్​ కన్సోల్​లు ఇందులో సాధారణంగానే ఉండబోతున్నాయి. మహీంద్రా కంపెనీ మార్కెట్‌లో ప్రస్తుతం ఒకే ఒక ఈవీ అందుబాటులో ఉంది. అదే మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ. ఇందులో 40కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. కాగా.. మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీలో 35 కేడబ్ల్యూ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉన్నది.

కారు ధర ఎంత ఉండబోతుంది..?


మహీంద్రా ఎక్స్‌యూవీ-300 కొత్త ఈవీ మోడల్‌ ధరకు సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, మోడల్స్‌ ఎక్స్‌షోరూం ధర రూ.15లక్షల నుంచి రూ.18లక్షల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​షోరూం ఈ మోడల్‌ కన్నా రూ.2లక్షలు ఎక్కువగా ఉంటుంది. ఎక్స్​యూవీ300 ఐసీఈ మోడల్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ సైతం రాబోతున్నట్లు తెలుస్తుండగా.. 2024 ఫిబ్రవరిలో సంస్థ లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈవీ, ఐసీఈ ఇంజిన్​ల ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై మహీంద్రా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

Exit mobile version