Site icon vidhaatha

WhatsApp | వాట్సాప్‌ వీడియో కాల్‌.. ఇక మరింత మందితో!

WhatsApp

లండన్‌: వీడియో కాల్స్‌ అంటే వాట్సాప్‌ ఓపెన్‌ చేయడం సహజం. అయితే.. ఇప్పటి వరకూ దీనిలో పరిమిత సంఖ్యలోనే కాలర్స్‌ పాల్గొనే అవకాశం ఉన్నది. దీనిని ఏకంగా 32కు పెంచుతూ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

గతంలో 32 మంది భాగస్వామ్యులు వాయిస్‌ కాల్‌ చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు వీడియో కాల్స్‌లో కూడా 32 మంది పాల్గొనే అవకాశాన్ని వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా తీసుకొచ్చింది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో బీటా వినియోగదారులకు మాత్రమే పరిమితం చేస్తారు. క్రమంగా మరింత మందికి దీనిని అందుబాటులోకి తెస్తామని సంస్థ పేర్కొంటున్నది.

దీనితోపాటు వీడియోకాల్స్‌లో స్క్రీన్‌షేరింగ్‌ ఫీచర్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా విండోస్‌ వెర్షన్‌లో బీటా వినియోగదారులకు మొదటగా అందుబాటులోకి వస్తుంది.

Exit mobile version