సామ్సంగ్ అన్ప్యాక్డ్ జులై 2024 – ఈవెంట్ (Samsung Unpacked 2024) వచ్చేసింది. ఈనెల 10న ప్యారిస్(Paris)లో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇది ప్రత్యేకంగా ఫోల్డబుల్ ఫోన్ల(Foldable Phones) విడుదల కార్యక్రమం. ఈసారి విడుదల కాబోయే ఉపకరణాలు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6(Galaxy Z Fold 6), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6(Galaxy Z Flip 6), గెలాక్సీ వాచ్ 7(Galaxy Watch 7 Series), గెలాక్సీ బడ్స్ 3(Galaxy Buds 3 Series). వీటిలో ఫోల్డ్ 6, అడ్డంగా మడతపెట్టే ఫోన్ (బుక్ లాగా) కాగా, ఫ్లిప్ 6 నిలువుగా మడతపెట్టేది. ఈ రెండు ఫోన్ల ఇంతకుముందు వర్షన్లు అందరికీ తెలిసినవే. వీటితో పాటు సామ్ సంగ్ స్మార్ట్వాచ్ కొత్త గెలాక్సీ వాచ్ 7, ఇంకా వైర్లెస్ ఇయర్బడ్స్ గెలాక్సీ బడ్స్ 3.
ఈ మధ్య ఫోల్డబుల్ ఫోన్లకు గిరాకీ బాగా పెరిగిందని సామ్‌సంగ్ చెబుతోంది. దానికి తగ్గట్టుగానే కొన్ని చైనా కంపెనీలు కూడా ఇటువంటి ఫోన్లను విడుదల చేసాయి. వివో ఎక్స్ ఫోల్డ్(Vivo X Fold), వన్ప్లస్ ఓపెన్(Oneplus Open), మోటొరోలా రేజర్(Motorola Razr).. వాటిల్లో ముఖ్యమైనవి. సామ్‌సంగ్ తర్వాత వీటిదే అగ్రస్థానం. ఒకసారి ఫోన్ తెరిస్తే తెర రెండింతలు అయి చిన్నపాటి ట్యాబ్లా ఉండటం వీటి ప్రత్యేకత. అన్ని పనులూ పెద్ద తెరమీద చేసుకున్నట్లుగా చేసుకునే వీలు కల్పించడం, ఎస్–పెన్(S Pen)తో రాయడం, గీయడం లాంటి పనులు కూడా చేయగలగడం వీటికే సాధ్యం. ఇప్పుడు సామ్‌సంగ్ తన కృత్రిమ మేధ ఫీచర్, సామ్‌సంగ్ ఏఐ(Samsung AI)ని గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఎస్24(Galaxy S24 Series) సిరీస్ ఫోన్ నుండి మొదలుపెట్టింది. దాన్లో భాగంగా మొదటిసారిగా ఏఐతో వస్తున్న ఫోల్డబుల్ గెలాక్సీ ఫోల్డ్ 6, ఫ్లిప్ 6 ఫోన్లు.
ఈసారి వీటి ప్రత్యేకతలు, 5 సిరీస్ కంటే ఏ విధంగా బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6(Galaxy Z Fold 6):
ఈ కొత్త ఫోల్డ్, పాత 5 సిరీస్ కంటే కొంచెం చిన్నగా, సన్నగా, తేలిగ్గా ఉంటుంది. అయితే వినియోగదారుడు కనిపెట్టేంత తేడా అయితే కాదు. కాకపోతే ఫోల్డ్ 5 వాడినవారికి ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా, బ్యాటరీ విషయాలలో ఎలాంటి మార్పూ లేదు. చూడటానికి కూడా అచ్చం ఫోల్డ్ 5 లాగే ఉంది. కొన్ని సాంకేతిక వివరాలు ఇలా ఉన్నాయి.
• తెరిచినప్పుడు తెర సైజు : 7.6 అంగుళాల క్యూఎక్స్జీఏ–డైనమిక్ అమోలెడ్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్
• మూసినప్పుడు తెర సైజు : 6.3 అంగుళాల డైనమిక్ అమోలెడ్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్.
• తెర రక్షణ : ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ విక్టస్2, ఐపి48 వాటర్ రెసిస్టెంట్.
• ప్రాసెసర్ : క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ( 8 కోర్)
• కెమెరాలు : వెనుకవైపు(ప్రధాన) – 12ఎంపీ అల్ట్రావైడ్, 50ఎంపీ వైడ్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్తో, 10ఎంపీ టెలీఫోటో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో
: ముందువైపు(సెల్ఫీ) – 10ఎంపీ కెమెరా, స్క్రీన్ కింద 4 ఎంపీ ఒకటి.
• బ్యాటరీ : 4400ఎంఎహెచ్
• మెమొరీ : 12జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్
• బరువు : 239 గ్రాములు
• ఇతరాలు : అల్ట్రా వైడ్ బ్యాండ్, యుఎస్బి–సి, ఎన్ఎఫ్సి, ఎస్–పెన్ సపోర్ట్.
• ఓఎస్ : ఆండ్రాయిడ్ 14 , వన్ యూఐ 5 తో.
ధరలు దాదాపు రూ. 1,96,000ల నుండి 2,30,000 వరకు ఉండనున్నాయి.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6(Galaxy Z Flip 6):
• తెరిచినప్పుడు తెర సైజు : 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి–డైనమిక్ అమోలెడ్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్
• మూసినప్పుడు తెర సైజు : 3.4 అంగుళాల ఫుల్ హెచ్డి – ఐపిఎస్, 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్.
• ప్రాసెసర్ : క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ( 8 కోర్)
• కెమెరాలు : బయటి వైపు(ప్రధాన) – 50ఎంపీ 2ఎక్స్ డిజిట్ జూమ్తో, 12ఎంపీ అల్ట్రావైడ్ (కవర్పై)
: లోపలి వైపు(సెల్ఫీ) – 10ఎంపీ కెమెరా
• బ్యాటరీ : 4000ఎంఎహెచ్
• మెమొరీ : 12జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్
• బరువు : 187 గ్రాములు
• ఇతరాలు : అల్ట్రా వైడ్ బ్యాండ్, యుఎస్బి–సి, ఎన్ఎఫ్సి
• ఓఎస్ : ఆండ్రాయిడ్ 14 , వన్ యూఐ 5 తో.
• ధరలు దాదాపు రూ. 1,18,000ల నుండి 1,30,000 వరకు ఉండనున్నాయి.
గెలాక్సీ వాచ్ 7 సిరీస్(Galaxy Watch 7 Series):
ఈ జులై అన్ప్యాక్డ్ ఈవెంట్ విడుదల కాబోయే మరో గ్యాడ్జెట్, గెలాక్సీ వాచ్ 7, 7 అల్ట్రా. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం, వీటి ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.
ఈ వాచ్లు రెండు పరిమాణాలలో లభించనున్నాయి. 40మి.మీ, 45మి.మీ. ఈ రెండింటిలోనూ రెండు రకాల ఆప్షన్లుంటాయి. ఒకటి కేవలం బ్లూటూత్తో, ఇంకొకటి బ్లూటూత్+4జి. అల్ట్రా మాత్రం 47మి.మీల పెద్ద సైజుతో, బ్లూటూత్+4జితో వస్తోంది. ఇది 1.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో, 480 X 480 రిసొల్యూషన్తో, సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్తో రాబోతోంది. రంగులు మాత్రం, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్, టైటానియం వైట్లలో ఉంటాయి. మిగతా వివరాలు ఈ కింద చూడవచ్చు.
గెలాక్సీ వాచ్ 7 అల్ట్రా:
• కొలతలు–బరువు : 47 మి.మీ, 47.4 X 47.1 X 12.1 మి.మీ – 60.5 గ్రా.
• మెటీరియల్ : కేస్ – టైటానియం, ముందు – సఫైర్ క్రిస్టల్, వెనుక – 3డి గ్లాస్ డయల్.
• తెర : 1.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 480 X 480 రిసొల్యూషన్, 327 పిపిఐ
• ప్రాసెసర్ : ఎక్సినోస్ డబ్ల్యూ1000
• మెమొరీ–స్టోరేజి : 2జిబి – 32 జిబి
• బ్యాటరీ : 590 ఎంఏహెచ్
• కనెక్టివిటీ : బ్లూటూత్ 5.3, వైఫై 2.4 + 5 జిహెచ్, ఎన్ఎఫ్సి, జిపిఎస్
• ఆపరేటింగ్ సిస్టమ్ : వన్ యూఐ వాచ్ 6.0
• సెన్సర్లు : జిపిఎస్, జియోమాగ్నెటిక్ సెన్సర్, ఆక్సిలరోమీటర్, గైరోస్కోప్, బారోమీటర్, టెంపరేచర్, హార్ట్ రేట్, మైక్రోఫోన్ ఇంకా స్పీకర్. ధరలు దాదాపు 29వేల రూపాయల నుండి ప్రారంభం కానున్నాయి.
ఇక మిగిలింది గెలాక్సీ బడ్స్ 3. ఇవి కూడా రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి బడ్స్ 3 కాగా, రెండోది బడ్స్ 3 ప్రొ.
ఇవి రెండు రంగులలో అంటే, సిల్వర్ ఇంకా తెలుపులలో అందుబాటులో ఉంటాయి. ఇంకా దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం ఐపి 57 రేటింగ్ రక్షణతో వస్తాయి. సామ్సంగ్ స్మార్ట్థింగ్స్ ఎనేబుల్ అయి ఉంటాయి కాబట్టి, పోగొట్టుకునే పరిస్థితి లేదు.
ఇక ప్రత్యేకతల విషయానికొస్తే, బడ్స్ ప్రొలో టూవే స్పీకర్లుండగా, బడ్స్లో వన్ వే. ప్రొలో అడాప్టివ్ నాయిస్ కంట్రోల్, బ్లేడ్ లైట్స్ ఇంకా ఆంబియెంట్ సౌండ్తో ఉంటాయ. మామూలు బడ్స్లో మాత్రం ఇవేవీ ఉండవు. బ్యాటరీ లైఫ్ ఏఎన్సీతో ప్రొలో 6 గంటలుండగా, బడ్స్లో 5 గంటలుగా ఉంది. ఏఎన్సీ లేకుండా రెండింటిలో ఇంకో గంట పెరుగుతుంది. ధరలు రూ. 12 వేల నుండి 20వేల దాకా ఉంటాయి.