కరెంటు బండ్లతో చాలా కష్టం : సర్వేలో నమ్మలేని నిజాలు

ఈవీ – విద్యుత్​ వాహనాలు.. ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న వాహన సాంకేతికత. ప్రతీ ఆటోమొబైల్​ కంపెనీ ఈవీలను తెస్తోంది. పెట్రోల్​, డీజిల్​తో విసిగిపోయిన ప్రజలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు సంవత్సరాలనుండి భారత్​లో ఈవీల అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. అయితే ఈ మధ్య ఈవీ యజమానులతో నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్​ విషయాలు బయటకొచ్చాయి.

విద్యుత్​ వాహనాలు ఇప్పుడు చెప్పుగోదగ్గ సంఖ్యంలో భారత రోడ్ల మీద పరుగెడుతున్నాయి. విదేశాల్లో విపరీతంగా పుంజుకున్న ఈవీల అమ్మకాలు ఈమధ్యే మన దగ్గర కూడా ఊపందుకుంటున్నాయి.  పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుతో వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ ఐసిఈ(ICE – Internal Combustion Engine) వాహనాలకు(అంటే పెట్రోల్​, డీజిల్​ వాహనాలన్న మాట), స్వస్తి పలికి, విద్యుత్​ వాహనాలకే ఓటు వేస్తున్నారు. భారత ఆటోమొబైల్​ రంగం కూడా ఈ విషయంలో మంచి ప్రగతిని కనబరుస్తోంది. టాటా, మహింద్రా, మారుతిలు(TATA, Mahindra and Maruti) తమ తమ కరెంటు బండ్లను రంగంలోకి దించి హిట్​ కొట్టాయి. అందులో టాటా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా నెక్సన్​.ఈవీ(TATA Nexon.ev), టాటా పంచ్​.ఈవీ(Punch.ev)లు మార్కెట్​ను దున్నేస్తున్నాయి. ఇవేకాక, విదేశీ కంపెనీలైన ఎంజీ మోటార్స్(MG Motors)​, బివైడీ(BYD), కియా(KIA), హ్యుండయి(Hyundai), హోండా(Honda)లు కూడా తమ ఈవీలను ఈ యుద్ధరంగంలో నిలిపాయి.

ఈ మధ్య కేవలం ఈవీల యజమానులతో ఓ సర్వే(Survey among EV Owners) నిర్వహించబడింది. ఈవీ వాడకంలో వారి అనుభవాలను వివరిస్తూ, విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. తాము తీసుకున్న నిర్ణయం చాలా తెలివితక్కువదని(Foolish decision), మళ్లీ వెనక్కి వెళ్లి, సంప్రదాయ ఐసీఈ బండ్ల(ICE Vehicles)నే కొంటామని కుండ బద్దలు కొట్టారు. సర్వేయర్లు షాక్​ తిన్న ఈ విషయం తాలూకు వివరాలిలా ఉన్నాయి. పార్క్​+ (Park+)అనే యాప్​ సంస్థ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో దాదాపు 500కు పైగా ఈవీ యజమానులను కలిసి సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం, విద్యుత్​ వాహనాల యజమానుల్లో 51 శాతం మంది ఈవీల పట్ల అసంతృప్తి(51% EV Owners are unhappy)గా ఉన్నారని తేలింది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో వాహనంగా ఈవీని కొనబోమని, కావలిస్తే ఉన్న ఈవీని తీసేసి సంప్రదాయ ఐసీఈ వాహనాన్నే కొంటామని స్పష్టం చేసారు. పార్క్​+ సంస్థ తన యాప్​ ద్వారా కార్​ యజమానులకు సేవలందిస్తుంది. వాహనాలకు సంబంధించి, అన్ని సేవలు మనం మర్చిపోయినా, అది గుర్తుపెట్టుకుని ఫాస్టాగ్​ రిచార్జ్​, ట్రాఫిక్​ చలాన్​ చెల్లింపులు, ఇన్సూరెన్స్​, కార్ల అమ్మకాలు, కొనుగోలు తదితర సేవలు ఒక్క యాప్​లోనే పొందుపరిచి అందిస్తుంది. దాదాపు 25వేలకు పైగా ఈ యాప్​(25K Users for Park+ App)కు వినియోగదారులున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ అమిత్​ లఖోటియా(Amit Lakhotia) మాట్లాడుతూ, “విద్యుత్​ వాహన యజమానుల మనోగతం ఎలా ఉంది.?” అనే అంశంపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సర్వే ప్రకారం, చార్జింగ్​ (Charging Anxiety) గురించి ఆందోళన చాలా ఎక్కువగా ఉన్నట్లు 88శాతం మంది యజమానులు చెప్పారు. చాలా మంది డ్రైవర్లు తమ ఇంటినుండి 50 కిమీ పరిధిలోనే తిరుగుతున్నట్లు, చార్జింగ్​ స్టేషన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల భయపడుతున్నట్లు తెలిపారు. భారత్​లో దాదాపు 20వేలకు పైగా చార్జింగ్​ స్టేషన్లు(20K charging stations across India) ఉన్నప్పటికీ, మంచిగా పనిచేసే చార్జింగ్​ కేంద్రాలు దొరకడం అనేది చాలా పెద్ద సమస్యగా తేల్చారు.

మరో ఇబ్బందిగా, మరమ్మత్తు ఖర్చుల(Repair Costs)ను పేర్కొన్న 73 శాతం మంది యజమానులు, ఈవీ కార్​ అనేది తమకు ఒక బ్రహ్మపదార్థంగా మిగిలిపోయిందనీ, అది ఎటూ అర్థం కాదని చెప్పారు. ఈవీ వాహనాల్లో ఉండే సంక్లిష్టమైన మెకానికల్​, ఎలక్ట్రికల్​ భాగాల రిపేర్లు అంత సులభంగా సాధ్యం కావని, చాంతాండంత లిస్టుతో బిల్లు రావడమే కాదు, చిన్నచిన్న రిపేర్లు కూడా స్థానికంగా ఉండే మెకానిక్​(Local Mechanics)లతో కాని పనులని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్ని రిపేర్​ షాపులు తిరిగినా, రిపేర్ల ఖర్చులపై కనీసం సెకండ్​ ఒపీనియన్​(Second Opinion on repair costs)  కూడా దొరకడం లేదని వాపోయారు.

మరొక పెద్ద సమస్య, రిసేల్​ వాల్యూ(Resale Value). సాధారణంగా మామూలు వాహనాల రీసేల్​ విలువ వాటి వయస్సు, మైలేజీ, బ్రాండ్​ విలువ, మోడల్​ మీద ఉండే ఇష్టం.. వీటన్నింటిపై ఆధారపడిఉంటుంది. ఈవీల రీసేల్​ విలువ కొంతకాలంలోనే విపరీతంగా(Darsitcally dropping) పడిపోతోందని, దాని బ్యాటరీ విలువే(Battery Value) కార్​ ఖరీదులో దాదాపు 30శాతం వరకు ఉండటమే కాకుండా, బ్యాటరీ పనితీరు కూడా కాలానుగుణంగా తగ్గిపోవడం(Degradation) కూడా ఇందుకు కారణమవుతోందని 33 శాతం మంది చెపుతున్నారు. మళ్లీ తాము పెట్రోల్​, డీజిల్​ వాహనాల వైపు మొగ్గుచూపడానికి ఇదే పెద్ద కారణమని అంటున్నయజమానులు, కారు, బ్యాటరీ పనితీరును అంచనా(Lack of Tests) వేయడానికి సరైన సాంకేతికత లేకపోవడంతో ఇటు అమ్మకందారులు, అటు కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారని వారు పార్క్​+(Park+)కు తెలిపారు.

 

ఈవీ వాహన పరిశ్రమ మొదటిసారిగా సెకండ్​హ్యండ్​ మార్కెట్​(Second hand market for Evs)ను చూస్తుండటం వల్ల, ఈవీ యజమానులు, ఐసీఈ వాహన యజమానులతో పోలిస్తే అసంతృప్తిగా ఉన్నారు. ఈ సర్వేపై పత్రికా ప్రకటనను విడుదల చేసిన లఖోటియా, భారత విద్యుత్​ వాహన చరిత్ర ఇప్పుడే మొదలైందనీ, దేశవ్యాప్తంగా పటిష్టమైన స్మార్ట్​ చార్జింగ్​(Robust and Smart Charging infrastructure) వసతుల వ్యవస్థను నెలకొల్పడం అనేది తక్షణావసరంగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.