Site icon vidhaatha

The Vera C. Rubin | తొలి చిత్రం తీసేందుకు అతిపెద్ద టెలిస్కోప్‌ రెడీ.. ఆ చిత్రాన్ని ఎక్కడ చూడాలంటే..

The Vera C. Rubin | డిజిటల్‌ కెమెరాలో మెగాపిక్సెల్‌ ఎంత ఉంటుంది? 30? 50? 100? కానీ.. 3,200 మెగాపిక్సెల్‌ డిజిటల్‌ కెమెరాతో ఫొటో తీస్తే? ఆ ఊహే అంతుచిక్కదు కదూ! ఇప్పుడు అలాంటి డిజిటల్‌ కెమెరా సిద్ధమైంది. నిజానికి ఇది ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మానవ నిర్మిత డిజిటల్‌ టెలిస్కోప్‌. దీనిపేరు ‘ది వేరా సీ రూబిన్‌ అబ్జర్వేటరీ. ఇది చిలీలో ఉన్నది. దాని తొలి చిత్రాన్ని 2025, జూన్‌ 23న విడుదల చేయనున్నది. ఖగోళ శాస్త్రంలో, భూమికి వెలుపల దాగి ఉన్న రహస్యాల ఛేదనకు మానవుడు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కొత్త అధ్యాయం కానున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రూబిన్‌ నిర్మాణానికి 2001లో ప్రతిపాదన రాగా.. 10 ఏళ్ల నుంచి నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. ఆకాశాన్ని నిత్యం ఫొటోలు తీస్తూ, దాని పరిశీలనలతో భారీ టైమ్స్‌ల్యాప్స్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేస్తుంది. భూమికి దక్షిణాది నుంచి కనిపించే ఆకాశాన్ని ఇది చేసే సర్వేను లెగసీ సర్వే ఆఫ్‌ స్పేస్‌ అండ్‌ టైమ్‌ (LSST) అని పిలుస్తారు. ఇది దాదాపు అల్ట్రావయలెట్‌, ఇన్‌ఫ్రారెడ్‌ వేవ్‌లెంత్‌లతో ఉంటుంది. దీనికి ఉన్న 3,200 మెగాపిక్సెల్‌ డిజిటల్‌ కెమెరాతో ఆకాశాలో ప్రతి భాగాన్ని 800 సార్లు స్కాన్‌ చేస్తుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి 20 టెర్రాబైట్స్‌ పరిమాణంలో డాటాను తయారు చేస్తుంది. ఇది ఎల్‌ఎస్‌ఎస్‌టీని తయారు చేసే సమయంలో సుమారు 60 పెటాబైట్స్‌ పరిమాణం కలిగిన రా ఇమేజెస్‌ను ఉపయోగిస్తుంది. ఇది ప్రస్తుతం ముర్చిసన్‌ వైడ్‌ఫీల్డ్‌ ఆర్రే ఇదే సమయంలో కలెక్ట్‌ చేసే డాటాకు సుమారు రెట్టింపు.

విశ్వంలో ఇప్పటి వరకూ చూడని అద్భుతమైన దృశ్యాలను రూబిన్‌ చిత్రీకరిస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మానవుడు కనీసం ఆలోచన కూడా చేయని ప్రశ్నలకు సమాధానాలు చెబుతుందని అంటున్నారు. రూబిన్‌ వేగం, విశాలమైన వీక్షణ నేత్రం, సెన్సిటివ్‌ కెమరా సమ్మేళనం.. ఒక టెలిస్కోప్‌ పనితీరును విస్తృతం చేస్తాయని ఎన్ఎస్‌ఎఫ్‌ అండ్‌ డీవోఈ పేర్కొన్నది. ఆకాశంలో రియల్‌టైమ్‌లో జరిగే మార్పులను కనిపెట్టడమే కాకుండా.. దాగి ఉన్న, అత్యంత సుదూర తీరాల్లో ఉన్న వాటిని సైతం ఏకకాలంలో గుర్తించగలదు. అంటే.. గగన వీధుల్లో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపెట్టని అరుదైన ఈవెంట్‌లను సైతం ఇది మనకు మొట్టమొదటిసారిగా అందిస్తుందన్నమాట. అందుకు ఇంతటి గొప్ప టెలిస్కోప్‌ పనితనాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు ఆసక్తి చూపుతున్నారు. ఈ టెలిస్కోప్‌ తన తొలి చిత్రాన్ని జూన్‌ 23, 2025న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు యూట్యూబ్‌లోని రూబిన్‌ అబ్జర్వేటరీ చానల్‌ ద్వారా వీక్షించవచ్చు.

Exit mobile version