Tech tips | మీ ఫోన్‌లో యాడ్స్‌తో విసిగిపోతున్నారా.. అయితే ఈ మూడు సెట్టింగ్స్‌ను ఆఫ్‌ చేయండి..

  • Publish Date - April 10, 2024 / 11:19 AM IST

Tech tips : మీ స్మార్ట్‌ఫోన్‌లో మాటిమాటికి యాడ్స్‌ వస్తున్నాయా..? మళ్లీమళ్లీ వస్తున్న ప్రకటనలతో మీరు విసిగిపోతున్నారా..? అయితే వీలైనంత త్వరగా ఈ మూడు సెట్టింగులను ఆఫ్ చేయండి. ఆ తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఫోన్‌లో ఏదైనా గేమ్‌ ఆడుతున్నప్పుడో, వీడియోలు చూస్తున్నప్పుడో, ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడో తరచూ ప్రకటనలు వస్తూ చికాకు పెడుతాయి. ఆ ప్రకటనలను నిలువరించడానికి మీరు మీ ఫోన్‌లో కొన్ని సెట్టింగులు చేసుకుంటే సరిపోతుంది.

ప్రకటనలను నిలువరించడానికి ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లాలి. తర్వాత గూగుల్ ఆప్షన్‌కి వెళ్లి, ఆల్‌ సర్వీసెస్‌ ఆప్షన్‌ను ఓపెన్‌ చేయాలి. దాంట్లో యాడ్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి డిలీట్‌ అడ్వర్టయిజింగ్‌ ఐడీపై క్లిక్ చేయాలి. అంతే ఇక మీ ఫోన్‌లో ఏ కంపెనీ ప్రకటనలు రావు. అదేవిధంగా వెబ్ అప్లికేషన్స్‌లో ప్రైవసీ కోసం ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ వెబ్ అప్లికేషన్ యాక్టివిటీ ఆప్షన్‌ను నిలిపేయాలి. దాంతో మీరు Googleలో సెర్చ్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రకటనలు కనిపించవు.

అదేవిధంగా మూడో సెట్టింగ్‌ ఏమిటంటే లొకేషన్ షేరింగ్‌ని ఆఫ్ చేయాలి. దానివల్ల మీరున్న ప్రదేశాన్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. అందుకోసం ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఆపై Google ఆప్షన్‌ క్లిక్‌ చేసి, డేటా అండ్‌ ప్రైవసీ ఎంపికను ఓపెన్‌ చేసి దాన్ని చేయాలి. పై మూడు సెట్టింగ్‌లు కాకుండా మీరు మీ ఫోన్‌లో థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్‌ను ఆఫ్ చేయాలి. అందుకోసం మీరు సెట్టింగ్స్‌కు వెళ్లాలి. తర్వాత ఏ యాప్‌ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయకూడదు అనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి. అక్కడ స్టాప్ డేటా, లొకేషన్ షేరింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే ఆ యాప్‌ మీరున్న ప్రదేశాన్ని ట్రాక్‌ చేయలేదు.

Latest News