Tech news | వచ్చే నెల 15 నుంచి ‘ట్రూకాలర్‌’ యాప్‌తో పనిలేదు.. ఎందుకంటే..!

Tech news | మనకు ఫోన్‌ చేస్తున్న వ్యక్తి ఎవరో ఫోన్‌ రింగ్‌ అవుతున్నప్పుడే తెలుసుకునేందుకు 'ట్రూకాలర్‌' యాప్‌ను వాడుతాం. మన ఫోన్‌లో ట్రూకాలర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటేనే ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు వస్తుంది. లేదంటే ఖాళీ నెంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. కానీ జులై 15 నుంచి ట్రూకాలర్‌ యాప్‌ అవసరం ఉండబోదని, ఆ యాప్‌ లేకుండానే మనకు ఫోన్ చేసిన వ్యక్తి పేరు తెలుస్తుందని టెలికామ్‌ కంపెనీలు చెబుతున్నాయి.

  • Publish Date - June 15, 2024 / 09:22 AM IST

Tech news : మనకు ఫోన్‌ చేస్తున్న వ్యక్తి ఎవరో ఫోన్‌ రింగ్‌ అవుతున్నప్పుడే తెలుసుకునేందుకు ‘ట్రూకాలర్‌’ యాప్‌ను వాడుతాం. మన ఫోన్‌లో ట్రూకాలర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటేనే ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు వస్తుంది. లేదంటే ఖాళీ నెంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. కానీ జులై 15 నుంచి ట్రూకాలర్‌ యాప్‌ అవసరం ఉండబోదని, ఆ యాప్‌ లేకుండానే మనకు ఫోన్ చేసిన వ్యక్తి పేరు తెలుస్తుందని టెలికామ్‌ కంపెనీలు చెబుతున్నాయి.

ట్రూకాలర్‌ యాప్‌తో పనిలేకుండానే అవతలి నుంచి మనకు ఫోన్‌ చేస్తున్న వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్‌ డిస్‌ప్లేలో కనిపించేలా టెలికామ్‌ కంపెనీలు టెక్నాలజీలో మార్పులు చేస్తున్నాయి. ముంబై, హర్యానాల్లోని టెలికామ్ కంపెనీలు దీనికి సంబంధించిన ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. వచ్చే నెల 15లోగా దేశవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అమలులోకి తీసుకురావాలని టెలికామ్‌ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఆ దిశగా పనులు జరుగుతున్నాయి.

సిమ్ కొనుగోలు చేసేప్పుడు వినియోగదారుడి పేరు, తదితర వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలు నిజమేననే రుజువు కోసం ధ్రువీకరణ పత్రం, ఫింగర ప్రింట్స్‌ తీసుకుంటారు. జూలై 15 నుంచి వినియోగదారుడి నుంచి సేకరించే ఈ సమాచారం మన ఫోన్‌ డిస్‌ప్లేలో కనిపించేలా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు ట్రూకాలర్‌ యాప్‌తో పని ఉండదు.

Latest News