Rs 5 Breakfast In Indiramma Canteen | రూ.5కే టిఫిన్– ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం

హైదరాబాద్‌లో ఆధునిక ఇండిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం, ప్రజలకు కేవలం రూ.5కే పోషక అల్పాహారం, 150 క్యాంటీన్లలో 30,000 మందికి సేవలు.

5-rupees-breakfast-scheme-indiramma-canteen-hyderabad

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర ప్రజల కోసం రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్ పథకంలో భాగంగా ఆధునిక క్యాంటీన్లను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి మోతీనగర్‌ ఎక్స్ రోడ్డులో, మింట్ కంపౌండ్ లో కొత్తగా ఆధునీకరించబడిన ఇందిరమ్మ క్యాంటీన్‌లను సోమవారం ప్రారంభించారు. ఒక టిఫిన్(అల్పాహారం) ఖర్చు రూ.19 కాగా, లబ్ధిదారులకు కేవలం రూ.5కే అందించబడుతుంది. మిగతా రూ.14ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, ఉప్మా, పూరి, వడ, పొంగల్ వంటిని ఇందిరమ్మ క్యాంటీన్ లో అందించనున్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లు కేవలం రూ.5కే పోషకమైన అల్పాహారం, వేడి మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తాయని తెలిపారు. తద్వార. రోజువారీ వేతన జీవులు, విద్యార్థులు, డ్రైవర్లు, వలస కార్మికులు, ప్రతిరోజూ సరసమైన ఆహారంపై ఆధారపడే పేద పౌరులకు గౌరవం, ఉపశమనం అందిస్తాయన్నారు. .

ప్రస్తుతం జీహెచ్ఎంసీ అంతటా 150 ఇందిరమ్మ క్యాంటీన్లు పనిచేస్తున్నాయని..ప్రతిరోజూ 30,000 మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రారంభం నుండి ఈ కార్యక్రమంలో 12.3 కోట్లకు పైగా భోజనాలను అందించారని, పేదలకు సరసమైన ఆహారాన్ని నిర్ధారించడానికి జీహెచ్ఎంసీ దాదాపు రూ.254 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ క్యాంటీన్లకు ఆధునికరణలో భాగంగా ఆధునిక ఆహార కంటైనర్లు, సరైన సీటింగ్, ఆర్వో తాగు నీరు, హ్యాండ్ వాష్ సౌకర్యాలు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు అందించబడుతున్నాయని వెల్లడించారు. లబ్ధిదారులకు గౌరవం, పరిశుభ్రతను అందిస్తాయన్నారు.

 

Exit mobile version