Southern States Top In IMFL Usage | ఐఎంఎఫ్ఎల్‌ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్: తెలంగాణ ర్యాంకు ఏంతో తెలుసా?

తెలంగాణ ఐఎంఎఫ్ఎల్ అమ్మకాల్లో 3.55 కోట్లు, దక్షిణాది రాష్ట్రాలు దేశంలో టాప్ లో నిలిచాయి, కర్ణాటక నెంబర్ వన్.

imfl-consumption-south-states-top-telangana-rank-ciabc-report-2025

భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. ఈ రాష్ట్రాల్లో 17 శాతం వాటాతో కర్ణాటక నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) డేటా ప్రకారం 2025 ఆర్ధిక సంవత్సరంలో ఐఎంఎఫ్ఎల్ ఆదాయం 58 శాతంగా ఉంది. ఇందులో కర్ణాటక రాష్ట్రం నుంచి 17 శాతం వాటా కలిగి ఉందని ఈ రిపోర్ట్ చెబుతుంది. దక్షిణాదిలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2025 మార్చి 31 నాటికి 23.18 కోట్ల కేసుల ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు జరిగాయి. అంటే దేశంలోని 58 శాతం అమ్మకాలు ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. మిగిలిన 42 శాతం అమ్మకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగాయి.

కర్ణాటకలో 6.88 కోట్ల కేసులు ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో 6.47 కోట్ల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు రాష్ట్రం 16 శాతం వాటా కలిగి ఉంది. 2024 ఆర్ధిక సంవత్సరంలో కూడా కర్ణాటక టాప్ లో నిలిచింది. ఈ రాష్ట్రంలో 6.83 కోట్ల కేసుల ఐఎంఎఫ్ఎల్ వినియోగించారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. తమిళనాడులో 6.44 కోట్ల కేసులు విదేశీ మద్యం విక్రయించారు. 2025 ఆర్ధిక సంవత్సరంలో 3.71 కోట్ల కేసులు ఆంధ్రప్రదేశ్‌లో, 3.55 కోట్ల కేసులు తెలంగాణలో విక్రయించారు. ఈ రెండు రాష్ట్రాలు ఐఎంఎఫ్ఎల్ అమ్మకాల్లో తొమ్మిది శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక 2.29 కోట్ల కేసుల మద్యం విక్రయించి కేరళ ఏడో స్థానంలో నిలిచింది. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు దక్షిణాది రాష్ట్రాల్లో 1 శాతం పెరిగాయి. దక్షిణాదిలోని పుదుచ్చేరిలో 2025 ఆర్ధిక సంవత్సరంలో 0.28 కోట్ల కేసులతో 10 శాతం వృద్దిని నమోదు చేసింది. దీంతో ఈ రాష్ట్రం ఐఎంఎఫ్ఎల్ లో విక్రయాల్లో 19వ స్థానంలో నిలిచింది.

దక్షిణాది రాష్ట్రాల తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు ఐఎంఎఫ్ఎల్ లో టాప్ లో నిలిచాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం 2.50 కోట్ల కేసులను విక్రయించి ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అమ్మకాల్లో ఈ రాష్ట్రం 6 శాతం వృద్దిరేటు సాధించింది. ఈ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ లో 1.37 కోట్ల కేసులు, ఢిల్లీలో 1.18 కోట్ల కేసులు, హర్యానాలో 1.17 కోట్ల కేసుల ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లో జరిగిన అమ్మకాల ప్రకారంగా రాజస్థాన్ 9, ఢిల్లీ 10, హర్యానా 11వ స్థానంలో నిలిచాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో 1 శాతం మాత్రమే ఈ మద్యం విక్రయాలు పెరిగాయి.

ఇక పశ్చిమ రాష్ట్రాల్లో 12 శాతం మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లో 4.70 కోట్ల కేసుల లిక్కర్ సేల్స్ జరిగాయి. పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 2.71 కోట్ల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. ఇక దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్ర ఐదో స్థానంలో ఉంది. పశ్చిమ రాష్ట్రాల్లో 3 శాతం పెరిగాయి.

ఇక తూర్పు రాష్ట్రాల్లో కేవలం 10 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1.49 కోట్ల కేసులతో తూర్పు రాష్ట్రాల్లో అగ్రబాగంలో ఉంది. బెంగాల్ రాష్ట్రంలో ఐఎంఎఫ్ఎల్ విక్రయాల్లో 4 శాతం వృద్ది సాధించింది. దేశ వ్యాయప్తంగా చూస్తే బెంగాల్ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది. బెంగాల్ దర్వాతి స్థానంలో ఒడిశా, అసోం, జార్ఖండ్ రాష్ట్రాలు నిలిచాయి. ఒడిశాలో 0.98 కోట్ల కేసులు, అసోంలో 0.96 కోట్ల కేసులు, జార్ఖండ్ లో0.32 కోట్ల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. అయితే జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు తగ్గాయి. పంజాబ్ లో 20 శాతం, జమ్మూలో 15 శాతం తగ్గినట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాల్లో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుదల కనిపించింది.

ప్రీమియం, లగ్జరీ బ్రాండ్స్ , విస్కీ వంటి వాటి అమ్మకాలు పెరిగాయి. అధిక పన్నులు, మహారాష్ట్రలో ఎంఎంఎల్ ప్రవేశపెట్టిన విధాన మార్పులు, తెలంగాణలో పాత బకాయిల చెల్లింపులో జాప్యం వంటి అంశాలు అమ్మకాలను ప్రభావితం చేశాయని సీఐఏబీసీ చెబుతోంది.

 

Exit mobile version