Site icon vidhaatha

NCW On Swati Case : మూడు రోజుల్లో స్వాతి కేసుపై నివేదిక ఇవ్వండి: డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ

Swati Murder Case

NCW On Swati Case | గర్భిణీ స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని మహిళా కమిషన్ తెలంగాణ డీజీపీ జితేందర్ కు మంగళవారం లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 23న రాత్రి స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశారు. ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలు గా చేసి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి మూసీ నదిలో పారేశారు. స్వాతి కన్పించడం లేదని ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పారు. స్వాతి బంధువు మహేందర్ రెడ్డి ఇంటికి వస్తే స్వాతి కన్పించడం లేదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు మహేందర్ రెడ్డిని తీసుకొని ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ మూట కన్పించింది. ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే స్వాతి మొండెం లభ్యమైంది. మూడు రోజులుగా మూసీలో పారేసిన స్వాతి శరీర భాగాల కోసం ప్రతాపసింగారం వద్ద మూసీ నదిలో డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు స్వాతిని హత్య చేసిన నిందితుడి మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

Exit mobile version