తెలంగాణకు దసరా ‘కిక్కు’: గత ఏడాది కంటే 7 శాతం పెరిగిన లిక్కర్ సేల్స్

తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లిక్కర్ సేల్స్ 7% పెరిగాయి.

telangana-dussehra-liquor-sales-7-percent-increase-rs-3048-crore-excise

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరాకు మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో మొత్తం రూ.3,048 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరాకు ఏడు శాతం లిక్కర్ సేల్స్ పెరిగాయి. 2024 సెప్టెంబర్ లో రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది 29.92 లక్షల లిక్కర్ కేసులు, 36.46 లక్షల కేసుల బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి దసరాను పురస్కరించుకొని మద్యం విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు, సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు,అక్టోబర్ 1న రూ. 86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

2023 దసరా పండుగ 9 రోజుల్లో రూ.1,057 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక 2024లో దసరా సందర్భంగా రూ. 1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం 10 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 11 వరకు 10.44 లక్షల మద్యం కేసులు, 17.59 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. దీని విలువ రూ. 1100 కోట్లు. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్ లో నిలిచింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి.

ఈ ఏడాది గాంధీ జయంతి, దసరా ఒకే రోజున వచ్చాయి. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు బంద్. దీంతో ఒక్క రోజు ముందుగానే మద్యం, మాంసం తెచ్చుకున్నారు. గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు దసరా రోజున సెలవు అంటూ లిక్కర్ దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.

 

Exit mobile version