విధాత, హైదరాబాద్ : నూతన డీజీపీగా నియామితులైన బీ.శివధర్ రెడ్డి బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లు కూడా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో శాంతిభద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.