విధాత, హైదరాబాద్ : నార్కట్ పల్లి మండలంలోని జువ్విగూడెంలోని ఓ రిసార్ట్ స్విమింగ్ ఫుల్ లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు నార్కట్ పల్లికి చెందిన నల్లగొండ రిషిక్(17), చౌటుప్పల్ కి చెందిన పోలోజు హర్షవర్ధన్ (17) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్లగొండ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
ఏడుపాయల వరదలో గల్లంతైన ఇద్దరు సురక్షితం
ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద మంజీరా నది వరదలలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి ఏడుపాయల వనదుర్గా ఆలయానికి వచ్చిన యువకులు నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. రెస్క్యూ బృందాలు, పోలీసులు గల్లంతైన యువకులను కాపాడాయి.