విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇటీవలే హైదరాబాద్ సీపీగా బదిలీయైన సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజు ప్రయాణాన్ని బస్సులో కొనసాగించి ప్రజారవాణా సంస్థపై తన అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్ – టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్‌భవన్ వరకు 113 I/ఎం రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద సొంత డబ్బులతో టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారు.