విధాత : తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చాక..రకరకాల చిత్రాల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల మధ్య సీట్ల కోసం సిగపట్లతో పాటు..పురుషులతోనూ..కండక్టర్లతోనూ ఘర్షణలు సాధారణంగా మారాయి. తాజాగా డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని బస్సు ముందు కూర్చొని ఓ మహిళ చేసిన హల్చల్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కిన మహిళ ఫ్రీ టికెట్ ఇవ్వాలని బస్సు కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది. ఈ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వరని…బస్సు దిగిపోవాలని సూచించారు. బస్సు నుంచి బలవంతంగా ఆమెను కిందకు దించారు. దీంతో ఆ మహిళ నాకు ఇదే బస్సులో ఫ్రీ టికెట్ కావాలంటూ బస్సు ముందు అడ్డంగా బైఠాయించి బస్సును ముందుకు కదలకుండా అడ్డుకుంది. పోలీసులు వచ్చి నచ్చ చెప్పిన వినకుండా నాకు డిలక్స్ బస్సులోనే ఫ్రీ టికెట్ కావాలంటూ రోధిస్తూ హల్చల్ చేసింది. అతి కష్టం మీద ఆర్టీసీ సిబ్బంది..పోలీసులు ఆమెను బస్సుకు అడ్డం నుంచి తొలగించి పక్కకు జరిపారు. మరో ఎక్స్ ప్రెస్ బస్సులో ఆమెను పంపించి శాంతింపచేశారు.