Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఆన్‌లైన్‌లో ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి..!

Amarnath Yatra | ఏటా సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగాన్ని దర్శించుకునేందుకు భారత్‌ నుంచే కాకుండా పలు దేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29న ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగనున్నది. దాదాపు 52 రోజుల పాటు యాత్ర కొనసాగనున్నది. యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర కొనసాగనున్నది. యాత్రకు జమ్మూ కశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

  • Publish Date - April 22, 2024 / 07:07 AM IST

Amarnath Yatra | ఏటా సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగాన్ని దర్శించుకునేందుకు భారత్‌ నుంచే కాకుండా పలు దేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29న ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగనున్నది. దాదాపు 52 రోజుల పాటు యాత్ర కొనసాగనున్నది. యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర కొనసాగనున్నది. యాత్రకు జమ్మూ కశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అమర్‌నాథ్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల సెలవులను రద్దు చేసింది. అమర్‌నాథ్‌ యాత్ర దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉన్న పహల్గామ్‌కు 48 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్‌ గుహ ఉంది.

మంచులింగం రూపంలో కొలువుదీరిన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు కశ్మీర్‌లోని గండేర్‌బల్‌ జిల్లాలోని గండేర్‌బల్‌ మార్గంలో ద్వారా ప్రయాణించవచ్చు. ఇక యాత్ర రిజిస్ట్రేషన్‌ ఇటీవల ప్రారంభం కాగా.. ఈ యాత్రలో పాల్గొనాలని భావిస్తున్న వారు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది అమర్​నాథ్​జీ దేవస్థానం బోర్డు. అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి రూ.150గా నిర్ణయించారు. అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకు శాఖల ద్వారా ఈ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..

అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనాలని భావిస్తున్న వారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఇందుకోసం మొదట అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు jksasb.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. మెనులో ‘ఆన్‌లైన్ సర్వీస్పై’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. అనంత‌రం I Agree చెక్ చేసి రిజిస్టర్‌పై క్లిక్ చేయాలి. ఓపెన్‌ అయిన ఫామ్‌లో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లే. అయితే, ట్రావెల్ పర్మిట్ డౌన్‌లోడ్ చేసుకోవడం మ‌ర‌చిపోకూడదు.

ఆఫ్‌లైన్‌లో..

ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునే వారు జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ 540 శాఖలలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది దేవస్థానం బోర్డు. అమర్‌నాథ్ యాత్ర కోసం ఫొటోగ్రాఫ్‌లు, యాత్రా రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250, గ్రూప్ లీడర్ పేరు, మొబైల్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్‌తో సహా చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టల్‌ చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్‌ 8 తర్వాత చెల్లుబాటయ్యే ఆరోగ్య ధ్రువీకరణపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పోస్టల్ ఛార్జీలను అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం చీఫ్ అకౌంట్ ఆఫీసర్‌కు పంపాల్సి ఉంటుంది. యాత్రలో 13 సంవత్సరాల లోపు.. 70 సంవత్సరాల పైబడిన వ్యక్తులు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం లేదు. అలాగే, ఆరువారాలు దాటిన గర్భిణులకు సైతం పాల్గొనే వీలు లేదు. అమర్‌నాథ్ యాత్ర చేయాలనుకునే వారికి హెల్త్ సర్టిఫికేట్ తప్పనిసరి.

Latest News