MakeMyTrip | అయోధ్య, లక్షద్వీప్‌ సహా పర్యాటకులు ఎక్కువగా వెతికింది ఈ ప్రాంతాల గురించే..! మేక్‌మైట్‌ట్రిప్‌ నివేదిక..!

MakeMyTrip | వేసవికాలం సెలవులు వస్తే చాలా.. చాలా మంది వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. సెలవుల్లో ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తుంటారు. కొందరు దేశంలోని ప్రముఖ ఆలయాలకు వెళ్తుంటే.. మరికొందరు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలకు వెళ్లాని ప్లాన్‌ చేసుకుంటారు. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటారు.

  • Publish Date - May 9, 2024 / 02:00 PM IST

MakeMyTrip | వేసవికాలం సెలవులు వస్తే చాలా.. చాలా మంది వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. సెలవుల్లో ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తుంటారు. కొందరు దేశంలోని ప్రముఖ ఆలయాలకు వెళ్తుంటే.. మరికొందరు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలకు వెళ్లాని ప్లాన్‌ చేసుకుంటారు. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో వేసవిలో ఫ్యామిలీ ట్రావెల్‌ సెగ్మెంట్‌ పర్యాటక రంగం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20శాతం పెరిగిందని.. అదే సమయంలో సింగిల్ పర్యాటకుల సంఖ్య సైతం 10శాతం పెరిగిందని మేక్‌మైట్రిప్‌ ప్రకటించింది. ఏయే ప్రాంతాలకు వెళ్లే బాగుంటుందని పర్యాటకులు తమ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసిన జాబితాలో గోవా మొదటి స్థానంలో ఉన్నా.. అయోధ్య, లక్షద్వీప్‌, నందిహిల్స్‌ తదితర పర్యాటక ప్రాంతాలు అత్యధికంగా సెర్చ్‌ చేసిన గమ్యస్థానాలని మేక్‌మైట్రిప్‌ తెలిపింది.

గత ఏడాది ఇదే కాలం మార్చి- ఏప్రిల్‌తో పోల్చితే 2024 ఏడాదిలో మార్చి – ఏప్రిల్ డేటా ఆధారంగా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను విడుదల చేసింది. తీర్థయాత్రల్లో ఎక్కువ మంది పూరీ, వారణాసి క్షేత్రాల గురించి సైతం సెర్చ్‌ చేశారు. అయితే, అయోధ్యని సెర్చ్‌ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరుగుతున్నట్లుగా ట్రెండ్‌లు చూపించాయని చెప్పింది. మేక్‌మైట్రిప్ ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం.. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో లక్సెంబర్గ్, లంకావి, అంటాల్యాలు ఉన్నపటికీ.. పర్యాటకులు ఆసక్తి చూపించిన ప్రాంతాల్లో బాకు, అల్మాటీ, నగోయా ఉన్నాయి. ఈ సందర్భంగా మేక్‌మైట్రిప్ కో-ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేశ్‌ మాగో మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో సెర్చ్ చేసిన పర్యటక ప్రాంతాలు గతేడాది కంటే బాగా పెరిగాయన్నారు. వేసవి కాలం ఎప్పుడూ అతిపెద్ద త్రైమాసికల్లో ఒకటిగా నిలుస్తుందని.. ఈ ఏడాది ఈ సెక్టార్‌ ఉత్సాహంగా కొనసాగుతుందని.. సెర్చింగ్‌లో ఆరోగ్యకరమైన వృద్ధిని గమనిస్తున్నామని తెలిపారు.

 

Latest News