Site icon vidhaatha

Actress టాప్‌లెస్‌ ఫొటో, Netizensపై సెటైర్‌

విధాత:టీవీ నటి టీనా దత్తా (Datta) ఇటీవల షేర్‌ చేసిన ఫొటో ఒకటి తీవ్ర విమర్శలపాలైన నేప‌థ్యంలో… ఆ ఫొటోలో టీనా టాప్‌లెస్‌గా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఓ నెటిజన్‌ మరీ దారుణంగా నటిని కించపరుస్తూ కామెంట్లు చేశాడు. ఇది చూసిన టీనా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

తన మీద నోరుపారేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది. దీంతో హడలెత్తిపోయిన సదరు నెటిజన్‌ వెంటనే ఆమెను సోదరిగా సంబోధిస్తూ క్షమాపణలు చెప్పాడట. ఇప్పటిదాకా నోటికొచ్చి మాట్లాడాడు, ఇప్పుడేమో సడన్‌గా అతడికి నేను సోదరినయ్యాను’ అని టీనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా ‘పితా మాతా సంతాన్‌’ అనే బెంగాలీ సినిమాలో బాలనటిగా కనిపించిన టీనా ఉత్తరన్‌ సీరియల్‌లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల మనసు దోచింది.

Exit mobile version