Site icon vidhaatha

టాయిలెట్ ఇంటిని ఎప్పుడైనా చూశారా .. వింతైన ఇల్లు

ఎవరికైన బాత్రూమ్ ఇంట్లో ఒక భాగం మాత్రమే .కానీ ఈయనకు మాత్రం బాత్రూమే ఇల్లు,ప్రపంచం.ఆ బాత్రూమే ఇప్పుడు ఫేమస్ మ్యూజియం అయ్యింది .

వివరాల్లోకెళితే :
ఈయన పేరు Sim Jae-duck.అనుకోని పరిస్థితిలో వాళ్ళ అమ్మమ ఇంట్లోనే బాత్రూంలో పుట్టాడు.అక్కడ మొదలైంది స్టోరీ.అప్పటినుంచి అతని జీవితం బాత్రూం చుట్టూ తిరిగింది.వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ‘మిస్టర్ టాయిలెట్ ‘అని పిలిచేవారు.ఈయన సౌత్ కొరియా లో ఉన్న సువాన్ అనే నగరానికి మేయర్ గా పనిచేశారు.

అందరు టాయిలెట్ ను వాడాలని ఒక్క పెద్ద ప్రచారం చేశారు.2002 ‘Beautiful టాయిలెట్’ అనే ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు.ఈ ప్రాజెక్ట్ లో సువాన్ నగరంలో 700 పబ్లిక్ టాయిలెట్స్ కట్టించారు.అదేవిధంగా అతని ఆలోచనలను ప్రపంచం మొత్తం విస్తరించాలనుకొన్ని ఒక సంస్థను స్థాపించారు.అతడు ఉండే ఇంటిని కూల్చేసి ఏకంగా టాయిలెట్ ఆకారంలో ఉండే ఇంటిని నిర్మించారు.అయితే 2009 లో అతను మరణించాడు.తరువాత అతని కుటుంబసభ్యులు సువాన్ నగరానికి దానం చేశారు.’మిస్టర్ టాయిలెట్’ ఇంటిని గవర్నమెంట్ మ్యూజియం గా మార్చింది .ఇది ఇప్పుడు ప్రపంచంలో ఫేమస్ అయ్యింది.

ReadMore:ఏడు చేపల కథలో ఇంత విషయముందా?

Exit mobile version