ధన్వంతరి….బోధిధర్మ….సుశృతుడు… చరకుడు….జీవకుడు…వాగ్భటుడు…నాగార్జునుడు…
భారతీయ ప్రాచీన ఆయుర్వేద విధానానికి ఆద్యులు ! వనమూలికల వైద్యానికి తిరుగులేదని నిరూపించిన అసమానులు….!
సాధారణ చికిత్సలు మొదలుకుని శాస్త్రచికిత్సలు విజయవంతంగా ఆచరించడమే కాదు, కొత్త కొత్త రోగాలకు ఔషాదలను కనిపెట్టి , భారతీయ ఆయుర్వేదాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టిన
మహానుభావులు…!
ఈ ఆయుర్వేదం ఇప్పుడు ఒక సంచలనం!
ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని వివరుస్తున్న గ్రంధం ” సుశృత సంహిత “.
ఈ ప్రకారం పూర్వం భారతీయ మహర్షులు…. ఋషులు….ఆస్థానవైద్యులు….ఆయుర్వేద వైద్య విధానంలో భాగంగా కొన్ని రోగాలకు కంటి నుండి చికిత్స అందించేవారు.
▪️కంటినుండి చికిత్స అందించే విధానాన్ని “సూచీ ప్రయోగం ” అనేవారు. ఇది సిరంజీ విధానం. కంటినుండి సూచీ ప్రయోగం చేయడం వలన రక్తానికి ఔషధం త్వరగా చేరుతుంది.
▪️ఆయుర్వేదంలో ఆనందభైరవి చిట్కాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇవి కంటి ద్వారా ప్రయోగింపబడుతాయి. ఈ విధానంలో ఔషద పదార్థాన్ని సానేరాయి మీద అరగ దీసి కంటికి కాటుకలా అద్దుతారు.కంటిలో విపరీతమైన బాధ…. కంటి నుండి నీరు…ఆపై ఉపశమనం కలుగుతుంది.
▪️ జ్వరం…. తలనొప్పి…. బొమ్మనొప్పి… వంటి పరిస్థితుల్లో కంటికి చలువ కాటుక పూయడం వంటి ఆయుర్వేద విధానాలు ఆచరిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా కంటిలో పసర్లు పోయడం అనేది ప్రాచీన వైద్య విధానం. ” కంటి నుండి చుక్కలు” అందించే విధానం ద్వారా ఊపిరితిత్తుల్లో రక్తం ఆక్సిజన్ స్థాయిలు పెరగడమనేది వైద్య రహస్యం. ఇదే పద్దతి అలోపతిలో eye drops గా ప్రసిద్ధి చెంది ఉన్నది.
ప్రస్తుతం… ఆనందయ్య కంటినుండే కరోనా నివారణ చికిత్స అందిస్తున్నాడు. ఇది మెడికల్ మాఫియ ఆగడాలకు దొరికే ఒక ఎత్తుగడ.ఎందుకంటే….కన్ను సున్నితమైన అవయవం. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. చిన్న నలుసుకే కన్ను పెద్దగా బాధపడుతుంది. ఈ క్రమంలో కన్నును ఆసరా చేసుకుని మెడికల్ మాఫియా ఫేక్ ఫోటోలతో అసత్య ప్రచారం చేసి….అమాయక ప్రజలను మభ్యపెట్టే అవకాశం వంద శాతం ఉన్నది. కాబట్టి ఈ విషయమై ప్రజలకు ముందస్తుగా #అవగాహన కలిపిపించాలి.