Site icon vidhaatha

అదృష్టంతో బతికేశాడు..లేకుంటే రోడ్డుపైనే ఖతం

biker-miraculously-escapes-unhurt-after-getting-trapped-under-car

విధాత : వాహనాలు నడపడంలో అతి చేస్తే ప్రాణాలు అంతే సంగతులనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఓ యువకుడు తన బైక్ పై రేసులో మాదిరిగా రోడ్డపై అతివేగంతో ప్రయాణిస్తున్నాడు. బైక్ వెలుతున్న మార్గంలో ఓ భారీ మూల మలుపు వద్ధ యువకుడు బైక్ ను నియంత్రించడంలో విఫలమవ్వడంతో రోడ్డుకు కుడివైపు బైక్ దూసుకపోయింది. అదే సమయంలో ఎదురుగా వెలుతున్న ఓ ట్రక్, రెండు కార్లకు బైక్ ఢీ కొట్టడంతో తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు.

అంతటి ప్రమాదంలోనూ అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు ఆ యువకుడి ధరించిన హెల్మెట్, రేస్ జాకెట్ అతనికి మరింత తీవ్ర గాయాలు కాకుండా కాపాడటంతో పాటు మూలమలుపులో ఎదురుగా వచ్చిన కార్లు నెమ్మదిగా వెలుతుండటంతో అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ వీడియో నెట్టింటా వైరల్ కాగా..వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడు బైక్ నడిపిన విధానం చూస్తే ఎదురుగా వెలుతున్న వాహనాలకు కాకపోయినా..రోడ్డు రైలింగ్ ను ఢీ కొట్టి పక్కన ఉన్న లోయలో పడిపోయేవాడేనంటున్నారు నెటిజన్లు.

Exit mobile version