తల్లి శిశువుతో ఇంటి బయట కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా కోతుల గుంపు ఆ ప్రాంతానికి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా, ఒక కోతి ఒక్కసారిగా దూకి ఆమె చేతుల్లో ఉన్న పాపను లాక్కొంది.
అంతే కాదు, ఆ చిన్నారిని తీసుకుని ఇంటి పైకప్పుపైకి ఎక్కింది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు భయంతో కేకలు వేశారు. కొందరు టపాసులు పేల్చి కోతిని భయపెట్టే ప్రయత్నం చేశారు.
ఈ గందరగోళంలో భయపడిపోయిన కోతి, చేతిలో ఉన్న పసికందును ఇంటి సమీపంలోని ఓ బావిలోకి విసిరేసి అక్కడి నుంచి పారిపోయింది.
వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు తాడ్లు, బకెట్లు సహాయంతో బావిలోకి దిగి బిడ్డను బయటకు తీశారు. అప్పటికే ఆ పాప స్పృహ కోల్పోయింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాప వేసుకున్న డైపర్ ఆమెకు రక్షణ కవచంలా పనిచేసింది. డైపర్ నీటిని పీల్చుకోకపోవడం వల్ల బరువు పెరగలేదు.
దాంతో చిన్నారి కొంతసేపు నీటిమీదే తేలుతూ పూర్తిగా మునగకుండా ఉంది. ఆ డైపర్ పాప ప్రాణాలను కాపాడిన సంజీవనిగా మారింది.