ఉదయం టీతో పాటు లేదా మధ్యలో ఆకలి వేస్తే వెంటనే గుర్తుకొచ్చేది బిస్కెట్లే. రకరకాల రుచుల్లో, ఆకారాల్లో లభించే ఈ బిస్కెట్లను తింటూ ఉండగా వాటిపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తుంటాయి.
చాలా మందికి అవి కేవలం అందంగా కనిపించేందుకు వేసిన డిజైన్ అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ రంధ్రాల వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది.
బిస్కెట్లు తయారయ్యే సమయంలో మైదా, చక్కెర, వెన్న, నీరు వంటి పదార్థాలను కలిపి మిశ్రమం తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఓవెన్లో కాల్చినప్పుడు లోపల ఆవిరి, గాలి ఏర్పడుతుంది.
ఆ గాలి బయటకు వెళ్లేందుకు దారి లేకపోతే బిస్కెట్లు ఉబ్బిపోతాయి లేదా మధ్యలో పగుళ్లు పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు తయారీ సమయంలో బిస్కెట్లపై చిన్న రంధ్రాలు చేస్తారు.
వీటినే ‘డాకింగ్ హోల్స్’ అని అంటారు.. ఈ రంధ్రాల వల్ల లోపల ఏర్పడిన ఆవిరి సులభంగా బయటకు వెళ్లిపోతుంది. దాంతో బిస్కెట్లు సమంగా కాలుస్తాయి.
అలాగే, బిస్కెట్లు అతిగా గట్టిగా మారకుండా, సరైన కరకరలత్వం రావడానికి కూడా ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. సాల్ట్ బిస్కెట్లు, క్రీమ్ లేకుండా ఉండే బిస్కెట్లలో ఈ రంధ్రాలు ఎక్కువగా కనిపిస్తాయి
ఎందుకంటే ఈ రకాల్లో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రంధ్రాలు బిస్కెట్ల ఆకారాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి.
ఓవెన్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బిస్కెట్లు వంకరగా మారకుండా, ఒకే మందంతో ఉండేలా చేస్తాయి. అందుకే బిస్కెట్లన్నీ ఒకేలా కనిపిస్తాయి.