భారత్‌లో జింక్ వినియోగం అనేది విపరీతమైన వేగంతో పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏటా సుమారు 1.1 మిలియన్ టన్నుల జింక్ వాడకం జరుగుతోందని లెక్కలు.

కానీ ఈ వాడకం వచ్చే 10 ఏళ్లలో అది 2 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంటే, ఈ లోహానికి వచ్చే డిమాండ్ బంగారం కంటే ఎక్కువగా ఉంటుందన్న మాట. 

ఇండస్ట్రియల్ రంగంలో జింక్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందని, ప్రస్తుతం ప్రపంచ ఆటో మొబైల్ పరిశ్రమలో గాల్వనైజ్డ్ స్టీల్ వినియోగం 90 నుంచి 95 శాతం ఉందని.. 

అదే భారత్‌లో అది కేవలం 23 శాతం మాత్రమే ఉందని తెలిపారు. జింక్ స్టీల్‌ను తుప్పు పట్టకుండా కాపాడుతుందని అన్నారు.. అలాగే సౌర, వాయు, విద్యుత్ రంగాల్లో కూడా జింక్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని గ్రీన్ తెలిపారు.

భారత్‌లో మాత్రం ఒక వ్యక్తి ప్రకారం చూస్తే జింక్ వినియోగం ప్రపంచ సగటుతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రెట్లు తక్కువగా ఉందన్నారు. 

అందుకే, గ్లోబల్ ప్రమాణాలను చేరుకునేందుకు భారత్‌లో జింక్ వినియోగాన్ని పెంచడం అవసరమని ఆయన తన ప్రకటనలో కీలక సూచనలు చేశారు.

ఈ మొత్తం లెక్కలు చూస్తే బంగారంలాగే విలువైన లోహాల జాబితాలో త్వరలో జింక్ కూడా చేరవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.