లోపల వేసుకునే దుస్తులు, నైట్ వేర్ లేదా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లాంటివి పెళ్లి గిఫ్ట్‌గా ఇవ్వకపోవడమే మంచిది. మీరు వధూవరులకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, పెళ్లి అనేది కుటుంబ సభ్యులు, పెద్దల మధ్య జరిగే వేడుక.
అందరి ముందు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు వారు కచ్చితంగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలాంటి పర్సనల్ బహుమతులు ఏవైనా ఉంటే, వారి బర్త్‌డేలకు లేదా పర్సనల్‌గా కలిసినప్పుడు ఇవ్వడం బెటర్.
కొన్ని వస్తువులు చూడటానికి బాగున్నా, మన సాంప్రదాయాల ప్రకారం నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఉదాహరణకు కత్తులు, కత్తెరలు లాంటి పదునైన వస్తువులు బంధాన్ని తెంచుతాయని అంటారు. అలాగే గడియారాలు, కర్చీఫ్స్ లాంటివి కూడా బాధకు, వీడ్కోలుకు సంకేతంగా భావిస్తారు.
పెద్దపెద్ద షో పీస్‌లు, వారికి ఏమాత్రం నచ్చని డెకరేటివ్ ఐటెమ్స్, గదిలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే వస్తువులు ఇవ్వద్దు. కొత్త జీవితం మొదలుపెడుతున్న జంటకు ఇవి భారంగా మారుతాయి. వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక అటకెక్కిస్తారు.
రీ-గిఫ్టింగ్ అనేది చాలా పెద్ద రిస్క్. పాత ప్యాకింగ్, డల్ అయిపోయిన బాక్సులు, అందులో ఉండే ఎక్స్‌పైరీ డేట్స్ వల్ల అది పాత గిఫ్ట్ అని వాళ్లు ఈజీగా పసిగట్టేస్తారు. అది చూశాక, మీ మీద వారికి ఉన్న గౌరవం పోతుంది.
ఒకవేళ బడ్జెట్ లేకపోతే, మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినా సరే వాళ్లు సంతోషిస్తారు. కానీ ఇలా ఎవరిదో తెచ్చి ఇవ్వకూడదు.
మీరు వారికి కేవలం వర్క్ ప్లేస్‌లో పరిచయం ఉన్నవారైతే లేదా దూరపు బంధువులైతే మరీ లక్షలు ఖర్చుపెట్టి గిఫ్ట్స్ ఇవ్వనక్కర్లేదు. ఖరీదైన బహుమతి ఇస్తేనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కాదు. మీరు ఇచ్చే ఓవర్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్, ఆ జంటపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి.
ఫ్యూచర్‌లో మీ పెళ్లికి కూడా వాళ్లు అంతే ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలేమో అని టెన్షన్ పడతారు. కాబట్టి, వారితో మీకున్న సాన్నిహిత్యాన్ని బట్టి మాత్రమే బడ్జెట్ డిసైడ్ చేసుకోవాలి కానీ, గొప్పల కోసం కాదు