వెక్కిరిస్తారు. నవ్వుతారు. "అదేం పేరు.. ఆ ఊళ్లో మంత్రగత్తెలు ఉంటారా?" అని సెటైర్ వేస్తారు. అందుకే అక్కడి మహిళలు... ఊరి పేరే తమకు శాపంలా మారినట్లు ఫీలవుతున్నారు. వారు ఏదైనా సిటీకి వెళ్లినప్పుడు.. తమ ఊరి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
చుడైల్ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం, పశుపోషణ చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మంది గిరిజన వర్గాలకు చెందిన వారే. పదేళ్లకు పైగా వాళ్లు ఊరి పేరు మార్చమని అధికారులను కోరుతున్నారు. కానీ.. ప్రభుత్వం ముందుకు రావట్లేదు.
అసలు ఆ ఊరికి చుడైల్ (మంత్రగత్తె) అనే పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. పోనీ అక్కడేమైనా మంత్రాలు, దెయ్యాల టెన్షన్స్ ఉన్నాయా అంటే.. ఏవీ లేవు. అక్కడి యువతులు.. సిటీలలోని హాస్టళ్లలో ఉంటూ.. ఊరి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
బస్సులో కూడా తమ గ్రామం పేరు చెప్పకుండా... చుట్టుపక్కల వేరే గ్రామం పేరు చెప్పుకొని, టికెట్ తీసుకుంటున్నారు. ఇది చిన్న సమస్య కాదు. చాలా తీవ్రమైనదే. ఊరి పేరు కారణంగా అక్కడి యువతకు పెళ్లిళ్లు కావట్లేదు. సంబంధాలు కుదరట్లేదు.
"ఊరి పేరే తేడాగా ఉంది.. ఎందుకొచ్చింది.. అపశకునం" అని చాలా మంది సంబంధాలు కుదుర్చుకోవట్లేదు. ముఖ్యంగా ఆ ఊళ్లో కుర్రాళ్లకు.. అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.
మోసే వారికే బరువు తెలుస్తుంది అంటారు కదా.. అలా సమస్యను ఫేస్ చేసే వారికే, దాని తీవ్రత తెలుస్తుంది. మనం ఇలా ఈ స్టోరీ చదివి.. ఓ నిమిషం అయ్యో అనుకొని.. తర్వాత ఇతర విషయాలపై దృష్టి పెడతాం.
ఆ ఊరి వారికి అలా విషయాన్ని వదిలేసే పరిస్థితి లేదు. తెల్లారింది మొదలు.. అదే కథ, అదే ఆలోచన, అదే బాధ, అదే వ్యథ. ఇదో తలనొప్పి లాంటిది. ఎన్ని మందులు వాడినా పోదు. పోవాలంటే ఒక్కటే మార్గం.. పేరు మార్చడమే.