మేడారంలోనూ ఓ మోనాలిసా మెరిసింది. ఆమె ఓ ఐపీఎస్ ఆఫీసర్ కావడం విశేషం. సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఆమె ఎవరో కాదు ఓ ఐపీఎస్ ఆఫీసర్ కావడం గమనార్హం. మేడారం జాతరలో భాగంగా సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో మంత్రి సీతక్క స్పెప్పులు వేశారు.
వారితో పాటు పోలీసు అధికారులు కూడా కాలు కదిపారు. వారిలో ఈ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మేడారంలో అందమైన ఐపీఎస్ ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. అలాగే షేర్ వీడియోలను ఎంతో మంది నెటిజన్లు చూస్తున్నారు.
దీంతో ఎవరా ఆఫీసర్ అంటూ నెటిజన్లు నెట్టింట సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఎంత బాగా చేసింది. అసలు ఈ అమ్మాయి. అంత అందం పెట్టుకుని ఎలా ఐపీఎస్ అధికారి అయ్యారు.
సినిమాలపైపు వెళ్లాల్సింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఐపీఎస్ అధికారిణి పేరు వసుంధర యాదవ్. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
2023 బ్యాచ్‌కు చెందిన వసుంధర యాదవ్. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కాగా అక్కడి నుంచి 2024లో తెలంగాణకు బదిలీపై వచ్చారు.