విమాన ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గతేడాది తీసుకువచ్చింది. ఇప్పటివరకూ ఎయిర్ పోర్ట్‌లో టీ, కాఫీ, సమోసా వంటి ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు గిర్రున తిరిగేవి.
టీ తాగాలంటే రూ.100.. ఒక సమోసా తినాలంటే రూ.400 కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పథకంతో టీ రోడ్డు మీద షాపుల్లో దొరికే ధరలకే లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే టీ టైం వంటి షాపుల కన్నా తక్కువే అన్న మాట. మరి ఇంతకీ ఈ పథకం పేరేంటి, టీ, సమోసా ధరలు ఎంతో తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ కేఫ్‌లను ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ టీ, కాఫీ, సమోసా ధరలు చూస్తే మనం ఎయిర్ పోర్టులో ఉన్నామా బస్ స్టాప్ వద్ద ఉన్నామా అనే విధంగా ఉన్నాయి.
టీ కేవలం రూ.10లకే లభిస్తుంది. సమోసా రూ.20లకే వచ్చేస్తుంది. ఈ పథకం ముందుగా కలకత్తా ఎయిర్ పోర్టులో ప్రారంభం అయింది. దశ వారీగా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి ఎయిర్ పోర్టులు ఈ పథకంలో భాగం అయ్యాయి. వీటిల్లో కూడా ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఏర్పాటు చేశారు.
కొన్నిసార్లు ఎయిర్ లైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. అవి రైలు ఛార్జీల కన్నా తక్కువగా ఉంటాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అనేది సాధ్యం అవుతుంది.