ఈ టెంపుల్ నిర్మాణానికి మొత్తం 662 నుంచి 750 కిలోల స్వచ్ఛమైన బంగారం వాడారు. నేటి మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ రూ.1170 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఆ సిక్కుల పవిత్ర మందిరమే గోల్డెన్ టెంపుల్. శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలిచే ఈ స్వర్ణ దేవాలయం సిక్కులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం.
అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది అమృత సరోవరం సరస్సు మధ్యలో అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ ఆలయాన్ని నిజమైన బంగారంతో నిర్మించారు. అయితే దీని నిర్మాణంలో పూర్తిగా బంగారం వాడలేదు. ఆలయ ప్రధాన గుమ్మటం, ఇతర భాగాలను బంగారు పూతతో అలంకరించారు.
సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన మహారాజా రంజిత్ సింగ్, 1830లో ఈ ఆలయానికి బంగారు పూత వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయ నిర్మాణానికి పాలరాయి, రాగి వాడి, పైకప్పుకు బంగారు పూత పూశారు.
దీనికోసం 150 నుంచి 162 కిలోల బంగారాన్ని వాడినట్లు చెబుతారు. అప్పట్లో దీని విలువ దాదాపు రూ. 65 లక్షలు. సాధారణంగా మనం నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం కాకుండా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని దీనికోసం వాడటం విశేషం.
తర్వాతి కాలంలో 1995- 1999 మధ్య స్వర్ణదేవాలయానికి మరమ్మతులు చేశారు. ఆ సమయంలో గోల్డెన్ టెంపుల్‌కి మరో 500 కిలోల 24 క్యారెట్ల బంగారు పూత వేయడం విశేషం.
గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్ వెబ్‌సైట్ ప్రకారం, దీని విలువ రూ.150 కోట్ల కంటే ఎక్కువ. ఈ బంగారాన్ని ఆలయ గుమ్మటాలు, తలుపులు, గోడలు, లోపలి పైకప్పులకు పూతగా వాడారు.
ఈ టెంపుల్ నిర్మాణానికి మొత్తం 662 నుంచి 750 కిలోల స్వచ్ఛమైన బంగారం వాడారు. నేటి మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ రూ.1170 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది.