భారతీయ సమాజంలో భార్య కంటే భర్త కనీసం 3 నుంచి 5 ఏళ్లు వయసు గ్యాప్ ఉంటే మంచిదని భావిస్తారు. ఇదే వివాహానికి అనువైన సమయంగా అనుకుంటారు. 

ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహంలో ఈ వయసు పాత్ర అనేది ఎక్కువగా ఉంది. అలాగే మన భారతీయ సమాజంలో భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలి. ఇది తరతరాలుగా సమాజంలో అల్లుకుపోయింది.

అయితే మన దగ్గరే కొన్ని చోట్ల చాలా మంది ఎక్కువ వయసు తేడాతో కూడా వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు. అలాగే స్త్రీల కంటే తక్కువ వయసు ఉన్న పురుషుడిని కూడా వివాహం చేసుకున్న వారు ఉన్నారు.

అయితేనేం వీరు విజయవంతంగా వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో వివాహానికి ఏజ్ మెటర్ కాదని అర్థం అవుతుంది. నేటి సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి.

దీంతో వయసు అనే తేడా లేకుండా సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. అయినప్పటికీ సమాజంలో కొందరు మాత్రం వివాహానికి ఏజ్ గ్యాప్ పక్కా అని పట్టించుకుంటున్నారు.

సైన్స్ విషయానికి వస్తే, వివాహం విషయంలో శారీరక, మానసిక పరిపక్వత కలిగి ఉండటం ఎంతో అవసరం. ఇంకా చెప్పాలంటే అబ్బాయిలు కంటే అమ్మాయిల్లో పరిణితి ఎక్కువగా ఉంటుంది. 

అబ్బాయిల్లో 9 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో హార్మోన్లు అనేవి మార్పులు చెందితే, అమ్మాయిల్లో ఆ మార్పు 7 నుంచి 13 ఏళ్ల వయసు మధ్యలోనే వస్తాయి. 

అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇదే శారీరక దృక్పథాన్ని ఇద్దరి మధ్య సూచిస్తుంది. ఇప్పుడు చెప్పింది కేవలం పెరుగుదల గురించి మాత్రమే. కానీ వివాహం విషయంలో మాత్రం ఈ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది