మన జ్ఞానేంద్రియాలు నియంత్రణల ఉంచడం, దీక్షలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడరాదు, చెవులతో చెడు వినరాదు, కళ్ళతో అశ్లీల వంటివి చూడరాదు. మనం చేసే ప్రతి పని సన్మార్గంలో ఉండే విధంగా చూడాలి. నెలరోజుల పాటు ఇలాంటి ఘటోరా నియమ నిష్ఠలు పాటించాలి.
ఈ రంజాన్ మాసంలో చెప్పుకోదగిన మరొక విశేషం ఏమిటంటే 'జాకత్' దానధర్మాలు చేయడం. ఈ మాసంలో జాకత్ చేయాలని ఖురాన్ చెబుతుంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నదే దీని నిర్వచనం
ఇది పేదవాడికి ఆర్థిక హక్కుగా కూడా చెప్తుంటారు. ఇలా ప్రతి ధనికుడు తమ సంపాదనలో కొంత మోతాదులో పేదవాడికి ఇవ్వాలని జకాత్ చెబుతోంది. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం ద్వారా శారీరక,మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి