Vidhaatha

Latest Telugu News

Menu Icon

ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి

దేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తుంటారు. వానకాలంతో పోల్చితే యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరత తక్కువగా ఉండటం, కనీస మద్ధతు ధర తక్కువ లభించడం మూలంగా సాగు అంతగా చేయరు. గత వానకాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వరిసాగు బాగా జరిగింది. దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా వరి సాగు చేయడంలో ముందంజలో ఉన్నాయి. వినియోగానికి మించి వస్తున్న దిగుబడిని నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పాడిపంటలు

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి పోరుబాట? ఈ నెల 15 తర్వాత చేపట్టే కార్యాచరణేంటి?

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం, అనుమతులు, ఆమోదాలు రానందున సీఎం రేవంత్ కేంద్రం పైన పోరాటం చేస్తారా? లేక కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, అడ్డుకుంటున్నారని చెబుతున్నందున కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడే ఆందోళన చేపడుతారా? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరసనలు తెలియజేస్తారా?

విధాత ప్రత్యేకం

బీజేపీలో విలీనానికి డజన్ చిన్న పార్టీల కుత్తుకలపై కత్తి? పవన్‌కు సీఎం ఆఫర్… పీకే డెసిషన్‌ పెండింగ్‌?

దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేస్తున్నదా? ఇప్పటి వరకూ పార్టీల్లో చీలికలు పెట్టి, శాసనసభాపక్షాలను విలీనం చేసుకుంటూ వచ్చిన బీజేపీ.. ఇక నేరుగా ఆ యా ప్రాంతీయ పార్టీలను తనలో కలిపేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదా? ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఫేస్‌గా పవన్‌ కల్యాణ్‌కు ఆఫర్‌ ఇచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇవే అంశాలు చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి.

విధాత ప్రత్యేకం

పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు

‘దాహమేసినప్పుడే బావి తవ్వడం’ ప్రారంభించినట్లుగా తెలంగాణలో పంట మార్పిడి ప్రకటన ప్రభుత్వానికి ఆపద మొక్కుగా మారిందనే విమర్శలు రైతాంగంలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పంట మార్పిడికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వంద శాతం విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఎందుకు మొగ్గు చూపడంలేదనే ప్రాథమిక కారణాలు అందరికీ తెలిసు. అయినా.. దీని మూలాలను నిజాయితీతో పరిష్కరించకుండా, కచ్చితమైన, నమ్మకమైన ప్రణాళిక రూపొందించి రైతులను ఒప్పించడంలో చిత్తశుద్ధి లేదనేది పదేపదే తేలిపోతోంది. మరో మాటలో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.

పాడిపంటలు

ముఖ్యాంశాలు

మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి

మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్‌పై నిరసనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేశారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ సీఈసీకి ఫిర్యాదు చేసింది. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది.

భారత్ అత్యధిక కాలం ప్రధానిగా మోదీ రికార్డు

భారత్ అత్యధిక కాలం ప్రధానిగా మోదీ రికార్డు

వరుసగా మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ, జవహర్‌లాల్ నెహ్రూ 4,398 రోజుల రికార్డును అధిగమించి దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు.

పెళ్లాంతో పేచీ…మనిషికి, గొరిల్లాకు ఒక్కటే బాధ!

పెళ్లాంతో పేచీ…మనిషికి, గొరిల్లాకు ఒక్కటే బాధ!

జపాన్ జూకు చెందిన ‘కియోమాసా’ గొరిల్లా తన భాగస్వామితో గొడవపడి ఒంటరిగా కూర్చుని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సందడి చేస్తున్నారు.

మహిళల రక్షణకు సీఎం విజయ్ ‘సింగప్పెన్’ ఫోర్స్

మహిళల రక్షణకు సీఎం విజయ్ ‘సింగప్పెన్’ ఫోర్స్

మహిళల భద్రత కోసం తమిళనాడు సీఎం విజయ్ ‘సింగప్పెన్’ పేరుతో ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ప్రారంభించారు. డ్రోన్ పెట్రోలింగ్‌తో పాటు నేరాల అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Viral News | 12 ఏళ్ల పాపలా నటించిన ఆంటీ.. దత్తత టైమ్‌లో విషయం తెలియడంతో లబోదిబోమన్న ఫ్యామిలీ!

Viral News | 12 ఏళ్ల పాపలా నటించిన ఆంటీ.. దత్తత టైమ్‌లో విషయం తెలియడంతో లబోదిబోమన్న ఫ్యామిలీ!

Viral News | బ్రెజిల్‌లో 37 ఏళ్ల మహిళ 12 ఏళ్ల బాలికల నటించి ఓ కుటుంబాన్ని దాదాపు 14 నెలల పాటు నమ్మించి మోసం చేసిన ఘటన బ్రెజిల్‌లో సంచలనంగా మారింది.