40 Tonnes Whale Washed Ashore In Anakapalli | అనకాపల్లి తీరంలో తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, పెద్దతినార్ల సముద్ర తీరానికి సుమారు 40 టన్నుల బరువు, 25 అడుగుల పొడవు గల భారీ తిమింగలం (Whale) కళేబరం కొట్టుకొచ్చింది.

40 tonnes whale washed ashore in Anakapalli district Nakkapalli

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్దతినార్ల గ్రామ సముద్ర తీరానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. నక్కపల్లి, పెద్దరాజయ్యపేట గ్రామాల మధ్య ఉన్న సముద్ర తీరం వెంబడి కొందరు యువకులు చేపల వేటకు వెళ్లగా…సముద్రపు అలలకు తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం కళెబరాన్ని గమనించారు.

40 టన్నుల బరువు గల ఈ భారీ తిమింగలం సుమారు 25అడుగుల పొడవు..10అడుగుల వెడల్పుతో ఉంది. స్థానికులు ఈ భారీ తిమింగలాన్ని ఆసక్తిగా తిలకించారు.