Banakacherla | ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టు నిలిపేయాలి.. సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ

Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మహమ్మద్ అమ్జద్ హుస్సేన్ లేఖ రాశారు.

Banakacherla | హైదరాబాద్, అక్టోబర్ 14 (విధాత ప్రతినిధి): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మహమ్మద్ అమ్జద్ హుస్సేన్ లేఖ రాశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 6న టెండర్లు పిలిచింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. పోలవరం-బనకచర్ల లింక్ ను నిర్మిస్తూ డిజైన్లు మార్చుతున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకోవడం వల్ల నష్టం ఏంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను తెలంగాణ వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్ తో గతంలో సమావేశమై తమ అభ్యంతరాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులతో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ రెండు నెలల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పారుదల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.