Heaven Location | ‘స్వర్గం’ ఎక్కడుందో ‘లొకేషన్‌’ చెప్పేశాడు…

ఎడ్విన్‌ హబుల్‌ ప్రతిపాదించిన ‘హబుల్స్‌ లా’ ప్రకారం విశ్వం విస్తరిస్తూనే ఉంది. భూమికి దూరంగా ఉన్న గెలాక్సీలు మన నుంచి వేగంగా దూరమవుతూనే ఉన్నాయి. అంత దూరంలోని ప్రాంతాల నుంచి మనకు వెలుగు ఎప్పటికీ చేరదు.. అయితే.. గిల్లెన్‌ అనే రిటైర్డ్‌ హార్వర్డ్‌ లెక్చరర్‌.. స్వర్గం అక్కడే ఉందని ప్రతిపాదిస్తున్నారు. దానికి నాలుగు కారణాలు కూడా చెబుతున్నారు.. అవేంటో చదివేయండి..

AI-generated Cosmic Horizon image representational purposes only

Heaven Location | స్వర్గం ఎక్కడుంది? ఎవరికీ తెలియదు. ఫలానా చోట ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. అయినా దీనిపై శాస్త్రవేత్తల్లోనూ చర్చలు ఉన్నాయి. స్వర్గం అనేది పై లోకాల్లో ఉంటుందని పురాణాలు చెబుతున్న కథ. హిందువులకే కాదు.. అన్ని మతాల వారికీ స్వర్గం, నరకం అనే భావనలు ఉన్నాయి. అయితే.. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌గా, సైన్స్‌ కమ్యూనికేటర్‌గా పనిచేసిన మైఖేల్‌ గిల్లెన్‌ ఈ విశ్వాంతరాళంలో ఒక భౌతిక ప్రదేశంలో స్వర్గం ఉందని ప్రతిపాదించారు. అంతేకాదు.. అది కాస్మిక్‌ హోరైజన్‌కు ఆవల ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ఓపెన్‌ పేజ్‌ ఎడిటోరియల్‌ రాశారు.

ఏమిటీ కాస్మిక్‌ హోరైజెన్‌?

ఒక పాలపుంత భూమికి ఎంత దూరంలో ఉంటే.. అంత వేగంగా భూమి నుంచి దూరమవుతున్నట్టేనని ఎడ్విన్‌ హబుల్‌ ప్రతిపాదించిన ‘హబుల్‌ లా’ చెబుతున్నది. విశ్వ విస్తరణ కారణంగా కొన్ని ప్రాంతాలు మన కంటికి ఎప్పటికీ కనిపించవని ఆయన పేర్కొన్నాడు. కాంతివేగంతో సమాన వేగంతో గెలాక్సీలు ఒకదానికొకటి దూరం అవుతున్నాయని ఎడ్విన్ హబుల్ కనుగొన్నాడు. మనకు కనిపించని, చేరలేని, దాటలేని ఒక సరిహద్దు అవతలి ప్రాంతం కాస్మిక్‌ హోరైజెన్‌. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. కాస్మిక్‌ హోరైజెన్‌ దూరం సుమారు 439 బిలియన్‌ ట్రిలియన్‌ కిలోమీటర్లు. ఈ పాయింట్‌ తర్వాతి ప్రాంతాలనుంచి వెలుగు మనకు ఎప్పటికీ చేరదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిల్లెన్‌ మాత్రం.. ‘స్వర్గం.. కాస్మిక్‌ హోరైజెన్‌కు అవతలివైపు ఉంది’ అని రాశాడు. అయితే.. గిల్లెన్‌ థియరీని ఇతర శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇది శాస్త్ర విజ్ఞానం కాదని, ఆధిభౌతిక శాస్త్రమని (metaphysics) అని తేల్చి చెబుతున్నారు.

గిల్లెన్‌ తన వాదనకు అనుకూలంగా నాలు కారణాలు చెబుతున్నాడు. అందుకోసం ఆధునిక కాస్మోలజీని ఉదహరిస్తున్నాడు.

గిల్లెన్‌ వాదనను కనెక్టికట్‌ కాలేజీలో ఆస్ట్రానమీ అసోసియేట్‌ టీచింగ్‌ ప్రొఫెసర్‌గా బోధిస్తున్న అలెక్స్‌ జియోనినాస్‌ కొట్టిపారేశారు. కాస్మిక్‌ హోరైజెన్‌ అనేది ఒక భౌతిక ప్రాంతం కాదని ‘పాపులర్‌ మెకానిక్స్‌’కు చెప్పారు. అయితే.. మనం చూడలేని, కమ్యూనికేట్‌ చేయలేని ప్రాంతం కాబట్టి.. అది పరిమితమైన సరిహద్దు అయి ఉండొచ్చని, దాని అవతల ఏముందనేది శాస్త్రీయంగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు. అందుకు గిల్లెన్‌ థియరీ.. శాస్త్రం అనేదానికంటే.. ఆధిభౌతిక శాస్త్రం.. మెటాఫిజిక్స్‌కు దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధంతాన్ని సృష్టి కథలా చూడకూడదని హెచ్చరిస్తున్నారు. విశ్వం ఆరంభం గురించి మాట్లాడేటప్పుడు మతపరమైన లేదా ఆధ్యాత్మిక పదజాలం వాడటం ప్రమాదకరమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read Also |

Urea Shortage | యూరియా కోసం మళ్లీ రైతుల పడిగాపులు.. పంట చేతికొచ్చే సమయంలో అష్టకష్టాలు
Type-2 Diabetes | స్టెమ్ సెల్ థెరపీతో టైప్–2 డయాబెటిస్‌ రివర్స్‌.. చైనా కీలక ఆవిష్కరణ
Virosh | పెళ్లిలో రాజ‌కుమారుడిలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వెడ్డింగ్ డ్రెస్సుల స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Latest News