HMWSSB | బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రంలో 18 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. న‌గ‌రంలో 18 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా( Water Supply )ను నిలిపివేయ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి( Jalamandali ) అధికారులు వెల్ల‌డించారు.

  • By: raj |    telangana |    Published on : Oct 26, 2025 9:35 AM IST
HMWSSB | బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రంలో 18 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. న‌గ‌రంలో 18 గంట‌ల పాటు నీటి స‌ర‌ఫ‌రా( Water Supply )ను నిలిపివేయ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి( Jalamandali ) అధికారులు వెల్ల‌డించారు. అక్టోబ‌ర్ 27వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 28వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని అధికారులు సూచించారు.

ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా, హెచ్ఎండీఏ ప్యారడైజ్ జంక్షన్ వద్ద వాటర్ బోర్డుకు చెందిన 800 ఎంఎం వ్యాసం కలిగిన ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను చేపడుతోంది. మారేడ్‌పల్లి నుండి కంట్రోల్ రూమ్‌కు కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను స్పోర్ట్స్ గ్రౌండ్, లే-రాయల్ జంక్షన్, బ‌ల‌మ్‌రైలోని ఎంఎస్ పైప్‌లైన్‌తో అనుసంధానించడానికి హెచ్ఎండీఏ జంక్షన్ పనులను చేపడుతోంది. ఈ కార‌ణంగా నీటి స‌రాఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే..

న‌ల్ల‌గుట్ట‌, ప్ర‌కాశ్ న‌గ‌ర్, మేక‌ల‌మండి, బుద్ధ్ న‌గ‌ర్, శ్రీనివాస‌న‌గ‌ర్, పాటిగ‌డ్డ రిజ‌ర్వాయ‌ర్, భోల‌క్‌పూర్, కవాడిగూడ‌, సీతాఫ‌ల్‌మండి, హ‌స్మ‌త్‌పేట్‌, ఫిరోజ్‌గూడ‌, గౌత‌మ్ న‌గ‌ర్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్, బ‌ల‌మ్‌రై పంప్ హౌజ్, బ‌ల‌మ్‌రై చెక్‌పోస్టు, బోయిన్‌ప‌ల్లి, ఏవోసీ రైల్వే కాల‌నీ ఏరియాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.