మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మానసికంగా శక్తివంతంగా ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలతో విచారంగా ఉంటారు. ఈ రోజు ప్రారంభించిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. అయితే, కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యయాలను అదుపులో ఉంచుకోకపోతే ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి.
మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అనుకూలమైన సమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనోవిచారం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో సకాలంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయడానికి మీ శాయశక్తులా కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్లారు. కలహాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. పదవీయోగం ఉంది. ప్రజాదరణ, అధికారం, గౌరవం, పరపతి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. నూతన వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో ఆటంకాలు అధిగమిస్తారు. ధననష్టం సూచన ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థికంగా జాగ్రత అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొన్ని సంఘటనలు మనోవ్యధ కలిగిస్తాయి. మానసిక అశాంతి వలన ప్రశాంతంగా ఉండలేరు. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టం కలగవచ్చు.
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణతో నడుచుకోండి. ఆస్తులు, అప్పుల విషయంలో స్థిరమైన నిర్ణయాలతో ముందుకెళ్తే మంచిది. ఆర్థిక విషయాల్లో స్పష్టమైన వైఖరితో ఉంటే నష్టాలు ఉండవు.
కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్య వైఖరి నష్టం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేస్తే ఫలితం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సహనం, శాంతి అవసరం. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తెలివిగా వ్యవహరించండి.
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ యోగం ఉంది. పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారులకు రుణ సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి మీ ఉత్సాహం చేయూతనిస్తుంది. ఆర్ధిక లాభాలకు అవకాశం ఉంది.