Colombia plane crash| ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమానం కూలిన దుర్ఘటనలో 15మంది దుర్మరణం చెందారు.
విధాత : దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమానం కూలిన దుర్ఘటనలో 15మంది దుర్మరణం చెందారు. 13 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బందితో కుకుటా నుంచి ఒకానాకు బయల్దేరిన బీచ్‌క్రాఫ్ట్-1900 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే వెనిజులా సరిహద్దులో కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు.
టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఫ్లైట్ సంబంధాలు తెగిపోయినట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో ఆ దేశానికి చెందిన ప్రతినిధులసభ సభ్యుడు డియోజెనెస్ క్వింటెరో కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం ప్రభుత్వ యాజమాన్యంలోని సతేన సంస్థకు చెందిన విమానంగా గుర్తించారు. ఈ ఘటనపై సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభిచంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram