Potato Storage Tips | ఆలుగడ్డలు తొందరగా పాడైపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి!

Potato Storage Tips | మీ ఇంట్లో ఆలుగడ్డలు పాడైపోతున్నాయా? ఆలుగడ్డలను నిల్వచేసేటప్పుడు 99 శాతం మంది చేస్తున్న కొన్ని పొరపాట్లను మానేస్తే.. ఈజీగా నెలరోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు.

Reported by: Chandram | ఆరోగ్యం | Mar 18, 2026, 8:52 pm IST
Read Time: 6 mins
Potato Storage Tips | ఆలుగడ్డలు తొందరగా పాడైపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి!

Potato Storage Tips | మీ ఇంట్లో ఆలుగడ్డలు తొందరగా పాడైపోతున్నాయా? రెండు మూడు రోజుల్లోనే మెత్తబడిపోయి మొలకలు వస్తున్నాయా? అయితే ఆలుగడ్డలు నిల్వ చేయడంలో మీరు పొరపాట్లు చేస్తున్నట్లే.! మరేం ఫర్వాలేదు.. కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఆలుగడ్డలు నెల రోజుల వరకు పాడవ్వకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఆ వంటింటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

99 శాతం మంది చేసే పెద్ద తప్పు ఇదే!

కూరగాయలు, ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం చాలామందికి అలవాటు. అలాగే ఆలుగడ్డలను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివల్ల ఇవి చాలా రోజుల వరకు పాడవ్వకుండా ఉంటాయని అనుకుంటారు. కానీ అదే అసలు తప్పు. ఫ్రిజ్‌లో పెడితేనే అసలు సమస్యలు వస్తాయి.

ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే.. ఆ చల్లదనానికి వాటిలోని స్టార్చ్ చక్కెరగా రూపాంతరం చెందుతుంది. ఫలితంగా ఆలుగడ్డలను ఉడికించినప్పుడు తియ్యగా అపోయితాయి. అలాగే తొందరగా కూడా పాడవుతాయి. కాబట్టి ఆలుగడ్డలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి!

చాలామంది ఆలుగడ్డలు కొన్న తర్వాత బుట్టలో పెట్టి ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంచుతారు. అయితే సూర్యరశ్మి, ఎక్కువ ఎండతగిలే ప్రదేశాల్లో వీటిని ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు చల్లటి ప్రదేశం, గాలి సరిగ్గా ప్రసరించే ప్రదేశాల్లో ఉంచాలి. దీనివల్ల ఆలుగడ్డలు మొలకలు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఈ పొరపాట్లు చేయొద్దు

ఆలుగడ్డలు కొన్న తర్వాత చాలామంది ఉల్లిగడ్డలు, టమాటలు ఉన్న బుట్టలో కలిపి స్టోర్ చేస్తుంటారు. అయితే ఇలా వీటన్నింటినీ నిల్వ ఉంచడం వల్ల ఆలుగడ్డలపై తొందరగా మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సపరేట్‌గా స్టోర్ చేయాలి. అలాగే ఇప్పటికే ఇంట్లో ఉన్న ఆలుగడ్డలతో పాత ఆలుగడ్డలను నిల్వ చేయకూడదు. దీనివల్ల మొత్తం పాడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని టిప్స్!

* ఆలుగడ్డలను పేపర్ సంచుల్లో, రంధ్రాలు ఉన్న బ్యాగుల్లో నిల్వ చేయడం ద్వారా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
* ఆలుగడ్డలను నిల్వ చేసేటప్పుడు కడగకూడదు. దీనివల్ల తేమ తగిలి తొందరగా పాడైపోతాయి.
* వండుకునేటప్పుడు ఆలుగడ్డల మీద ఉన్న మొలకలను తొలగించాలి. వీలైతే వాటిని వండుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
* ఎప్పటికప్పుడు పాడైన ఆలుగడ్డలను తీసేస్తూ ఉండాలి. లేదంటే వాటి ద్వారా మరిన్ని పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఆలుగడ్డలు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి

మార్కెట్‌లో ఆలుగడ్డలను కొనేటప్పుడు గట్టిగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆలుగడ్డలను మార్కెట్‌కు తీసుకొచ్చే క్రమంలో దెబ్బలు తగిలి మెత్తబడుతుంటాయి. దీనివల్ల అవి తొందరగా పాడవుతాయి. కాబట్టి మెత్తబడిన ఆలుగడ్డలను కొనకపోవడమే మంచిది. అలాగే ఆలుగడ్డలపై అక్కడక్కడ ఆకుపచ్చ రంగు ఉన్న వాటిని కూడా కొనకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read More:

Hair Care | వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తే మంచిది? జుట్టు రకాన్ని బట్టి నిపుణులు చెబుతున్న సూచన ఇదే..!

Neuroscience | ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్‌లో విప్లవాత్మక ముందడుగు